మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ, ఇదే ఆల్కహాల్ మీ అందాన్ని పెంచడంలోనూ సహాయపడుతుంది అంటే మీరు నమ్ముతారా? మీరు చదివింది నిజమే, అయితే.. అన్ని రకాల ఆల్కహాల్స్ కాదు.. కానీ రెడ్ వైన్ తో మాత్రం మీ అందం రెట్టింపు అవ్వడం పక్కా. దాని అర్థం.. మీరు రెడ్ వైన్ రోజూ తాగాలని కాదు. దానిని ముఖానికి రాస్తే చాలు. ఇలా చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా,యవ్వనంగా మెరిసిపోయేలా చేస్తుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మానికి రెడ్ వైన్ రాస్తే ఏమౌతుంది?
డార్క్ స్పాట్స్ క్లియర్ చేస్తుంది...
ముఖంపై డార్క్ స్పాట్స్ సమస్య చాలా మందిని వేధిస్తుంది. దుమ్ము, ధూళి, యూవీ కిరణాలు మరికొన్ని కారణాల వల్ల ముఖంపై డార్క్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. ఈ డార్క్ స్పాట్స్ పోగొట్టుకోవడానికి చాలా మంది ఏవేవో క్రీములు రాస్తూ ఉంటారు. అయినా కూడా ఫలితం రాలేదు అంటే, మీరు రెడ్ వైన్ సీరం వాడితే చాలు. ఈ రెడ్ వైన్ సీరం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డార్క్ స్పాట్స్ ని పూర్తిగా తొలగించడానికి, ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడతాయి.
మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది
మీరు మీ ముఖానికి రెడ్ వైన్ సీరం రాసినప్పుడు, డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించేస్తుంది.ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా, తేలికగా కనిపించేలా చేస్తుంది.
సూర్యరశ్మి నుండి రక్షిస్తుంది
సూర్యరశ్మి మీ శరీరానికి ముఖ్యమైనది అయినప్పటికీ, ఎక్కువ ఎక్స్‌పోజర్ చర్మానికి హానికరం. ఇది స్కిన్ టాన్‌కు కారణం కావడమే కాకుండా మెలనిన్ ఉత్పత్తి పెరగడం, చర్మానికి నష్టం వంటి ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. రెస్వెరాట్రాల్ వంటి రెడ్ వైన్ యాంటీఆక్సిడెంట్లు మీ చర్మంపై రక్షిత అవరోధంగా పనిచేస్తాయి, UV కిరణాల హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తాయి. ఇది సూర్యరశ్మి నుండి టాన్ ఏర్పడకుండా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది..
చాలా మంది ముఖంపై పిగ్మెంటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. దాని వల్ల ముఖం కళ తప్పినట్లు కనపడుతుంది.అలాంటి వారు ముఖానికి రెడ్ వైన్ సీరం , రెగ్యులర్ అప్లికేషన్ మీ చర్మాన్ని సమం చేయడానికి సహాయపడుతుంది. సూర్యుని హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తుంది.
చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది
రెడ్ వైన్ చర్మానికి పూయడం వల్ల మీ చర్మంలోని కొల్లాజెన్ పరిమాణం పెరుగుతుంది, ఇది మీ చర్మాన్ని సాగేలా ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది సన్నని గీతలను తొలగించడంలో సహాయపడుతుంది, మీ ముఖానికి తాజాగా, యవ్వనంగా కనిపిస్తుంది.