మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీ ముద్దుల కుమార్తె ఇషా అంబానీకి పరిచయం అవసరం లేదు. ఆమె ఎప్పుడూ తన లైఫ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఈ విషయంలో ఇషా అంబానీకి తన ఇంట్లోనే పోటీ మొదలైంది. ఆమే ప్రగ్యా సబూ. ఇషా.. వ్యాపారవేత్త ఆనంద్ పెరమాల్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఆనంద్ కజిన్ ఆదిత్య షా భార్యే ఈ ప్రగ్యా సబూ. ఇషా అంబానీలా ప్రగ్యా ప్రైమ్ లైట్ లో లేకపోయినా, ఆమె గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.
ఆదిత్య షా, ప్రగ్యా 2020లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లిలో ఇషా అంబానీ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తన వదినగా అన్ని బాధ్యతలు నిర్వర్తించారు. ఆ పెళ్లి ఫోటోలు అప్పుడు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.
ప్రగ్యా సబూ ఎవరు?
ప్రగ్యా సబూ కూడా ఒక వ్యాపారవేత్త. ఫ్యాషన్ డిజైనర్, జుంబా ఇన్స్ట్రక్టర్, హెల్త్ స్టార్టప్ కో-ఫౌండర్. ఆమె కోల్ కతాలో జన్మించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT), ఢిల్లీలో చదివారు. అంతేకాకుండా అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీఎస్సీ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ కూడా చదివారు.
ప్రగ్యా వివిధ హోదాల్లో పనిచేశారు
ఆదిత్య భార్య ప్రగ్యా ఆస్కార్ హెల్త్, అసానా వంటి ప్రఖ్యాత కంపెనీలలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె Aara Healthకు కో-ఫౌండర్ గా ఉన్నారు. ఈ స్టార్టప్ భారతదేశంలోని యువతలో ఆరోగ్య స్పృహను పెంచే పని చేస్తోంది.
బిగ్ బీతో కూడా సంబంధం ఉందా?
ప్రగ్యా బ్రాండ్ Aara Healthకు సంబంధించిన ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా కూడా దీనితో కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లైమ్ లైట్ కు దూరంగా ఉండటం వల్ల ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించవు.
ఫిట్నెస్, డ్యాన్స్ అంటే పిచ్చి
ప్రగ్యా ఒక ప్రొఫెషనల్ మాత్రమే కాదు, సర్టిఫైడ్ బాలీవుడ్ జుంబా ఇన్స్ట్రక్టర్ కూడా. డ్యాన్స్ ద్వారా ప్రజలను ఫిట్నెస్ కోసం ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా ఆమె TEDx స్పీకర్ కూడా, అక్కడ సాంస్కృతిక, సామాజిక సమస్యల గురించి మాట్లాడారు.