Face Glow: పసుపులో ఇదొక్కటి కలిపి రాస్తే, ముఖం మెరిసిపోవడం పక్కా..!

Published : Jun 25, 2025, 06:05 PM IST

అచ్చంగా పసుపు కాకుండా అందులో కాస్త గంధం కూడా కలపాలి. ఈ రెండూ కలిపి రాస్తే కచ్చితంగా మీ ముఖం రెట్టింపు అందంతో మెరిసిపోతుంది.

PREV
15
పసుపుతో ఫేస్ ప్యాక్..

మన భారతీయ సంస్కృతిలో పసుపు కి చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపు లేకుండా ఎలాంటి శుభకార్యం జరగదు. పెళ్లి, పండగ, పూజ ఏదైనా పసుపు ఉండాల్సిందే. శుభకార్యాల నుంచి శరీర శుభ్రత వరకు పసుపు ది కీలక పాత్ర. ఇదే పసుపు మన అందాన్ని పెంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. అయితే, అచ్చంగా పసుపు కాకుండా అందులో కాస్త గంధం కూడా కలపాలి. ఈ రెండూ కలిపి రాస్తే కచ్చితంగా మీ ముఖం రెట్టింపు అందంతో మెరిసిపోతుంది. మరి, దాని కోసం ఈ రెండింటినీ మన ముఖానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం...

25
పసుపు – సహజ యాంటీ సెప్టిక్

పసుపు అనేది సహజ యాంటీ సెప్టిక్ గుణాలను కలిగిఉన్న ఔషధం. ఇందులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం సూక్ష్మక్రిములతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా చర్మంపై అప్లై చేసినప్పుడు, ఇది ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి మరింత బాగా పని చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అలాగే డల్ గా మారిన చర్మాన్ని తిరిగి ప్రకాశవంతంగా మారుస్తుంది. అందుకే.. పెళ్లికి ముందు కచ్చితంగా వధూవరులకు పసుపు రాస్తారు.

35
గంధం – చర్మాన్ని శుభ్రపరిచే సహజ మూలిక

గంధం చర్మానికి శాంతినిచ్చే గుణాన్ని కలిగి ఉంది. దీనిలో ఉండే సహజ నూనెలు, కూలింగ్ ఎలిమెంట్స్ ముఖానికి రాసినప్పుడు, డ్రై స్కిన్ సమస్యను తగ్గించి, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ముఖ్యంగా చర్మ రంధ్రాలను శుభ్రపరచడం ద్వారా మొటిమలతో పోరాడుతుంది. నల్ల మచ్చలు తగ్గించి, సహజంగా గ్లో ఇస్తుంది. అంతేకాదు.. గంధం నుంచి మంచి సువాసన వస్తుంది. అది.. మన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

45
కాలుష్యం, సూర్యకాంతి నుంచి రక్షణ

ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం, తీవ్రమైన సూర్యకాంతి వల్ల చర్మ సమస్యలు అధికమవుతున్నాయి. అందుకే పసుపు, గంధం కలిపిన పేస్టు ముఖానికి రాస్తే.. ముఖానికి రక్షణ కవచంలా పని చేస్తుంది. ముఖాన్ని అందంగా మారుస్తుంది. ఫేస్ మీద పేరుకున్న ట్యాన్ సమస్యను కూడా తగ్గిస్తుంది. రెండు రోజుల్లోనే ముఖంలో గ్లో క్లియర్ గా కనపడుతుంది.

ఎలాంటి స్కిన్ టోన్ ఉన్నవారికైనా...

పసుపు-గంధం పేస్ట్ ఎలాంటి స్కిన్ టోన్ వారికైనా బాగా సూట్ అవుతుంది. ముఖ్యంగా చర్మం పొడిగా ఉండేవారు దీనిని వాడితే మంచి తేమ అందుతుంది. మాయిశ్చరైజింగ్ గుణాల వలన చర్మం అందంగ కనపడుతుంది. డైరెక్ట్ గా నీటితో కాకుండా రోజ్ వాటర్ లేదా పాలు లాంటివి కలిపి రాస్తే.. మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

55
పసుపు – గంధం ఫేస్ ప్యాక్ తయారీ విధానం

ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. సమాన మోతాదులో పసుపు, గంధం పొడిని తీసుకోవాలి. మీ చర్మ రకాన్ని బట్టి రోజ్ వాటర్ లేదా పాలు కలిపి పేస్ట్ లా చేయాలి. దీనిని ముఖం, మెడపై సమంగా అప్లై చేసి, 15-20 నిమిషాల పాటు ఉంచి, గోరువెచ్చటి నీటితో కడగాలి. వారంలో 2-3 సార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు కనబడతాయి. అయితే.. ఈ పసుపు, గంధం చాలా స్వచ్ఛంగా ఉండాలి. కెమికల్స్ కలిసినవి అయితే.. మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కస్తూరి పసుపును ఉపయోగించడమే మంచిది, ఎందుకంటే ఇది ముఖం మీద మచ్చలు తొలగించడం చాలా బాగా పని చేస్తుంది.మొట్టమొదటిసారి ఉపయోగించే ముందు, చేతి మోచేయి మీద తేలికగా పూసి పరీక్షించండి. అలా చేయడం వల్ల అలర్జీ ఉందా లేదా తెలుసుకోవచ్చు.

ఫైనల్ గా..

మన పెద్దలు పసుపు – గంధం వంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలను ఎందుకు ఎక్కువగా ఉపయోగించేవారో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. వీటిని మన జీవితంలో ప్రవేశపెట్టడం ద్వారా, మనం ప్రకృతి ఆధారిత ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. రసాయన పదార్థాలతో నిండిన ఫేస్ ప్యాక్స్ కన్నా, ఇలాంటి సంప్రదాయ ఉపాయాలు ఆరోగ్యకరమైన, దీర్ఘకాలిక ఫలితాలు ఇస్తాయి. మీరు కూడా మీ రోజువారీ బ్యూటీ రొటీన్‌లో ఈ పసుపు – గంధం చేర్చి, అందాన్ని పెంచుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories