Skin Care: ఇవి రాస్తే, ముఖంపై ముడతలే రావు

Published : Apr 26, 2025, 03:09 PM ISTUpdated : Apr 26, 2025, 03:12 PM IST

యవ్వనంగా కనిపించాలి అంటే ఖరీదైన ట్రీట్మెంట్లు చేయించుకోవాలని, వేలు ఖర్చు చేసే క్రీములు, సీరమ్స్ ముఖానికి  రాసుకోవాలి అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ, వాటి అవసరం లేకుండా కూడా మీరు యవ్వనంగా కనిపించవచ్చు.

PREV
15
Skin Care: ఇవి రాస్తే, ముఖంపై ముడతలే రావు


వయసు పెరుగుతుంటుంటే ముఖం ముడతలు రావడం, వయసు మళ్లిన వారిలా కనిపించడం చాలా సహజం. కానీ.. ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపించడం ఎవరికీ నచ్చదు. వయసు పెరుగుతున్నా కూడా తాము మాత్రం యంగ్ గా కనిపించాలనే అందరూ కోరుకుంటారు. అయితే.. అలా కనిపించాలంటే ఖరీదైన ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మరింత ఖరీదైన క్రీములు కూడా కూడా పూయాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్ ముఖానికి రాయడం వల్ల  మీ వయసు అస్సలు పెరగదు. యవ్వనంగా కనిపిస్తారు. 

25


కీరదోస ఫేస్ ప్యాక్..

కీరదోసతో ముఖానికి ఫేస్ ప్యాక్  రాయడం వల్ల మీ వయసు తగ్గిపోతుందని మీకు తెలుసా? దీనిని రెగ్యులర్ గా ఫేస్ కి రాయడం వల్ల మీ స్కిన్ తేమగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఏజెనింగ్ లక్షణాలు ముఖాన్ని అందంగా మారుస్తాయి.మీడియం సైజు కీరదోస తీసుకొని దానిని తురుముకోవాలి. దాని నుంచి రసం వేరు చేయాలి. ఇప్పుడు దీనిలో రోజ్ ఆయిల్ వేసి, కాటన్ బాల్ సహాయంతో ముఖానికి అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాలు అలానే ఉంచి.. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.
 

35

అరటిపండు ఫేస్ ప్యాక్
మెత్తని అరటిపండు ఇంట్లోనే ముడతలను తొలగించడానికి , చర్మాన్ని బిగుతుగా చేయడానికి చాలా ప్రభావవంతమైన మార్గం. ఇందులో విటమిన్ ఎ , సి పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దీన్ని ఉపయోగించడానికి, పండిన అరటిపండును మెత్తగా చేసి మీ ముఖం , మెడ అంతటా పూయండి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై చల్లటి నీటితో కడగాలి. దీన్ని ఉపయోగించిన తర్వాత, మీ చర్మం మృదువుగా మారుతుంది.

45

గుడ్డు తెల్లసొన మాస్క్
గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో తేమను కూడా పెంచుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముడతలు కూడా తక్కువగా కనిపిస్తాయి. దీనిని ఉపయోగించడానికి, ఒక గుడ్డును పగలగొట్టి, గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలోకి వేరు చేయండి. తరువాత కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, గుడ్డులోని తెల్లసొన తేలికగా  నురుగుగా మారే వరకు కొట్టండి. మిశ్రమాన్ని శుభ్రమైన చర్మానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

55

ఈ మూడు మాస్క్ లను రెగ్యులర్ గా ప్రయత్నిస్తే.. కచ్చితంగా మీ ముఖం మరింత యవ్వనంగా మారుతుంది. మీ పెరిగిన వయసు మీ ముఖంలో అస్సలు కనిపించదు.

Read more Photos on
click me!

Recommended Stories