Gold: 916 బంగారానికీ, 21 క్యారెట్ల బంగారానికీ తేడా ఏంటి?
బంగారు ఆభరణాల విషయానికి వస్తే, ఎక్కువగా 916 , 22 క్యారెట్ల పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. మరి, ఈ రెండూ ఒకటేనా? రెండింటికీ తేడా ఏంటి? బంగారం స్వచ్ఛత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బంగారం స్వచ్ఛత విషయానికి వస్తే, ప్రజలు 24 క్యారెట్లను ఎక్కువగా నమ్ముతారు.కానీ, బంగారం ఆభరణాలు మాత్రంర 22 క్యారెట్లలో మాత్రమే అమ్ముతారు. మరి, 916 అంటే ఏంటి? అనే సందేహం మీకు రావచ్చు. 916 క్యారెట్ల బంగారాన్ని బంగారు ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. ఇక్కడ 916 అంటే బంగారం 91.6 శాతం స్వచ్ఛమైనది.మిగిలిన 8.4 శాతం రాగి, వెండి లేదా ఇతర లోహాల మిశ్రమం కావచ్చు. ఈ మిశ్రమం బంగారాన్ని బలోపేతం చేస్తుంది.దానిని ఆభరణాలుగా అచ్చు వేయడం సులభతరం చేస్తుంది. 916 క్యారెట్ల బంగారం 22 క్యారెట్ల బంగారంతో సమానంగా పరిగణిస్తారు.
24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛతను కలిగి ఉంటుంది, కానీ అది చాలా మృదువైనది.అచ్చంగా బంగారంతో ఆభరణాలు తయారు చేయలేరు. అందుకే.. దాంట్లో రాగి, వెండి లాంటివి కలుపుతారు. అప్పుడు అది 22 క్యారెట్ లేదంటే 916 గోల్డ్ గా పరిగణిస్తారు. మనం కొనే బంగారం స్వచ్ఛమైనది అని చెప్పడానికి దానిపై 916 అని హాల్ మార్క్ వేస్తారు.
916 బంగారం,22k బంగారం మధ్య తేడా ఏమిటి?
916 బంగారం, 22 క్యారెట్లు వేర్వేరు అని మీరు అనుకుంటే, మీరు పొరబడినట్లే. ఎందుకంటే 916 బంగారం, 22 క్యారెట్లు ఒకటే. రెండింటిలోనూ 91.6 శాతం బంగారం, 8.4 శాతం ఇతర లోహాల మిశ్రమం ఉంటుంది. ఒక్కో ప్రదేశంలో ఒక్కోలా పిలుస్తారు.
KDM బంగారం అంటే ఏమిటి?
KDM బంగారాన్ని కాడ్మియం బంగారం అని కూడా అంటారు. ఇది కాడ్మియం అనే విషపూరిత లోహాన్ని కలిగి ఉన్న ఒక రకమైన బంగారు మిశ్రమ లోహం. ఇది ఆభరణాలను బలంగా , మెరిసేలా చేస్తుంది. కానీ, ఇది పర్యావరణానికి , ఆభరణాలను తయారు చేసే చేతివృత్తులవారికి ఆరోగ్య సంబంధిత సమస్యలను సృష్టిస్తుంది. అందుకే BIS ఇప్పుడు దీనిని నిషేధించింది.