వండుకునే సమయం లేక.. బయట దొరికే జంక్ ఫుడ్ లాంటివి తింటూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు.. విటమిన్లు, ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. ఇది చివరకు జుట్టు రాలడానికి కారణం అవుతుంది
అందమైన, ఒత్తైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. కానీ, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది.అయితే.. మనం సరైన పోషకాలు తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. మరి, ఎలాంటి విటమిన్లు తీసుకోవడం వల్ల మనకు అసలు హెయిర్ ఫాల్ సమస్య ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం...
25
విటమిన్ల లోపం..
ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే అయిపోయింది. ఇంటి పని, ఆఫీసు పనితో తమ తిండి, నిద్ర గురించి కూడా ఆలోచించడం లేదు. వండుకునే సమయం లేక.. బయట దొరికే జంక్ ఫుడ్ లాంటివి తింటూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు.. విటమిన్లు, ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. ఇది చివరకు జుట్టు రాలడానికి కారణం అవుతుంది అందుకే ఈ కింది విటమిన్లు కచ్చితంగా తీసుకోవాలి.
35
విటమిన్ ఎ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది...
విటమిన్ ఎ, రెటినోల్ అని కూడా పిలుస్తారు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు ఊడిపోవడాన్ని నిరోధించే పదార్ధం అయిన సెబమ్ స్రావాన్ని మనకు అందిస్తుంది. జుట్టు బాగా పెరగాలంటే కచ్చితంగా విటమిన్ ఎ తీసుకోవాల్సిందే. ఈ విటమిన్ ని కనుక కచ్చితంగా తీసుకుంటే.. జుట్టు డ్రైగా, ఎండిపోయినట్లుగా ఉండదు. విటమిన్ ఎ ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉన్న విటమిన్ ఎ ని మరీ ఎక్కువగా తీసుకుంటే కూడా నష్టాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి, ఆ పొరపాటు చేయకూడదు. ఈ విటమిన్ మనకు పాలకూర, క్యారెట్, తోటకూర వంటి కూరగాయల్లో లభిస్తుంది.
జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి కొన్ని పోషకాలు అవసరం. విటమిన్ బి12 వాటిలో ఒకటి. విటమిన్ బి12 ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు విటమిన్ బి12 ముఖ్యమైనది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
55
కొత్త జుట్టు పెరుగుదలకు విటమిన్ డి..
విటమిన్ డి కూడా మన జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ ని పెంచుకోవడం కోసం రోజూ కాసేపు ఎండలో సమయం గడిపితే సరిపోతుంది. రోజుకు 15-20 నిమిషాలు సరిపోతుంది. కానీ శీతాకాలంలో కావాల్సినంత విటమిన్ డి లభించదు. కాబట్టి, ఆ సమయంలో ఆహారం లేదా సప్లిమెంట్ల రూపంలో దీనిని తీసుకోవచ్చు.