Hair Care: ఈ ఒక్క సీరమ్ రాస్తే.. జుట్టు తక్కువ సమయంలోనే ఒత్తుగా పెరగడం పక్కా..!

Published : Oct 07, 2025, 02:20 PM IST

Hair Care: జుట్టు పొడుగ్గా పెరగాలని చాలా మంది కోరుకుంటారు. దాని కోసం  ఖరీదైన షాంపూలు, నూనెలు వాడేస్తూ ఉంటారు. కానీ, రసాయనాలు ఉన్నవి వాడే బదులు.. సహజ ఉత్పత్తులు వాడితే.. ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

PREV
14
hair care

తమ ముఖం అందంగా మెరిసిపోవాలని ఎంత మంది అమ్మాయిలు కోరుకుంటారో... తమ జుట్టు కూడా అంతే అందంగా మెరిసిపోవాలని అనుకుంటారు. దాని కోసం చాలా మంది తమ జుట్టు అందంగా కనిపించాలని ఖరీదైన షాంపూలు, నూనెలు వాడుతూ ఉంటారు. ఇవి సరిపోవు అన్నట్లు.. హెయిర్ గ్రోత్ కోసం మార్కెట్లో కి ఖరీదైన సీరమ్స్ కూడా వచ్చాయి. అయితే... వాటితో సంబంధం లేకుండా... మన హెయిర్ ని ఏ మాత్రం డ్యామేజ్ చేయకుండా, చాలా తక్కువ సమయంలో ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. అందుకు మనం ఇంట్లో సీరమ్ తయారు చేసుకోవచ్చు. మరి, ఆ సీరమ్ ఎలా తయారు చేయాలి..? దాని తయారీకి ఏం కావాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం....

24
ఇంట్లోనే సీరమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:

మెంతులు – 2 టీస్పూన్లు

నల్ల జీలకర్ర – 2 టీస్పూన్లు

అవిసె గింజలు – 1 టీస్పూన్

లవంగాలు – 7 నుండి 8

విటమిన్ E క్యాప్సూల్స్ – 2

34
సీరమ్ తయారు చేసే విధానం....

ముందుగా పై పదార్థాలన్నింటినీ మిక్సర్‌లో వేసి పొడిగా రుబ్బుకోండి. తర్వాత ఒక పాన్‌లో ఒక కప్పు నీరు వేసి ఈ పొడిని అందులో కలపండి. మధ్య మంటపై 5 నిమిషాలు మరిగించండి. మిశ్రమం చిక్కగా మారిన తర్వాత స్టౌవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దానిని కాటన్ వస్త్రంతో వడకట్టి ఫిల్టర్ చేయండి. చివరగా, ఆ ద్రావణంలో 2 విటమిన్ E క్యాప్సూల్స్ కట్ చేసి ఆ లిక్విడ్ ని అందులో వేసి బాగా కలపండి. అంతే... మీ జుట్టును ఒత్తుగా మార్చే హెయిర్ సీరమ్ రెడీ అయినట్లే.

44
ఉపయోగించే విధానం:

ఈ సీరమ్‌ను జుట్టు వేర్ల నుంచి చివర్ల వరకు రుద్దాలి. తర్వాత 30-40 నిమిషాల పాటు అలాగే ఉంచి, మృదువైన షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం గణనీయంగా తగ్గుతుంది.

ఈ సీరమ్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు...

జుట్టు రాలడం తగ్గిస్తుంది: మెంతుల్లో ఉన్న ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, నయాసిన్ వంటి పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి.

చుండ్రు తగ్గిస్తుంది: లవంగం యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నిండి ఉంటుంది. ఇది తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ముఖ్యంగా చుండ్రు తగ్గిస్తుంది.

జుట్టు మెరుస్తుంది: అవిసె గింజల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు జుట్టుకు సహజ మెరుపుని ఇస్తాయి.

జుట్టు పెరగడానికి సహాయపడుతుంది: నల్ల జీలకర్రలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలలో సహాయపడతాయి.

విటమిన్ E ప్రభావం: ఇది తల చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరచి జుట్టు పెరగడానికి సహాయపడతాయి.

ఈ సీరమ్ ఉపయోగించడం వల్ల జుట్టు సహజంగా మృదువుగా, బలంగా, పొడవుగా మారుతుంది. ముఖ్యంగా రసాయన పదార్థాలు లేని ఈ సీరమ్ అన్ని రకాల జుట్టుకీ అనుకూలంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories