Henna: తెల్ల జుట్టు కవర్ చేయాలని హెన్నా పెడుతున్నారా? ఇలా చేస్తే మీకే నష్టం

Published : May 11, 2026, 06:46 PM IST

Henna:  హెన్నా చాలా నేచురల్ కదా అందరూ జుట్టుకు పూసేస్తూ ఉంటారు. కానీ, రెగ్యులర్ గా , ఇష్టం వచ్చినట్లు జుట్టుకు హెన్నా పెడితే.. చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
16
హెయిర్ డై కంటే హెన్నా బెటరా?

తెల్ల వెంట్రుకలు రాగానే వాటిని కవర్ చేయాలని  చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ఎక్కువ మంది మార్కెట్లో దొరికే హెయిర్ డైలు వాడతారు. అయితే.. హెయిర్ డై ల్లో కెమికల్స్ ఉండటం వల్ల  జుట్టు పాడైపోతుందని కొందరు నేచురల్ గా దొరికే హెన్నా వాడుతుంటారు. కానీ.. హెన్నా వాడినా కూడా ప్రమాదమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

హెన్నా సహజమైనదే అయినప్పటికీ… దానిని తరచూ వాడటం వల్ల  హెయిర్ కలర్ సంగతి పక్కన పెడితే.. జుట్టు బాగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.  అసలు.. హెన్నా జుట్టును ఎలా డ్యామేజ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం….

26
హెయిర్ డ్రై అయిపోతుంది....

హెన్నాలో లో టానిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది జుట్టు మంచి ఎరుపు రంగును అందిస్తుంది. కానీ, ఈ టానిన్ కు జుట్టులోని సహజ తేమ, నూనెను పీల్చుకునే గుణం ఉంటుంది. అందుకే.. రెగ్యులర్ గా హెన్నాను జుట్టుకు వాడటం వల్ల మీ జుట్టు ఎండిపోయి గడ్డి పీచులా, నిర్జీవంగా మారుతుంది. దీని వల్ల జుట్టు అందంగా కనిపించదు.

36
జుట్టు గరుకుగా మారుతుంది..

చాలామంది హెన్నా పెట్టుకున్నాక జుట్టు ఒత్తుగా కనిపిస్తోందని సంబరపడతారు. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. మెహెందీ రంగు జుట్టు లోపలికి వెళ్లదు. అది కేవలం వెంట్రుక పైభాగంలో ఒక మందపాటి రంగు పొరలా పేరుకుపోతుంది. దీనివల్ల జుట్టు ఒత్తుగా అనిపించినా, కాలక్రమేణా సహజమైన మృదుత్వాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా సిల్కీ హెయిర్ ఉన్నవారికి, మెహెందీ వాడకం వల్ల అది గరుకుగా మారి, తన సహజ గుణాన్ని కోల్పోయేలా చేస్తుంది.

46
కుదుళ్లు బలహీనపడటం - జుట్టు పలచబడటం
మెహెందీ జుట్టుకు కండిషనింగ్ చేస్తుందని మనం అనుకుంటాం. కానీ అతిగా వాడితే ఫలితం రివర్స్ అవుతుంది. మెహెందీ పొరలు తల చర్మంపై పేరుకుపోయినప్పుడు, జుట్టు కుదుళ్లకు అందాల్సిన ఆక్సిజన్, పోషణ సరిగా అందదు. తల చర్మం పొడిబారిపోవడం వల్ల కుదుళ్లు పట్టు కోల్పోతాయి. దీంతో జుట్టు పలచబడటం, విపరీతంగా రాలడం మొదలవుతుంది.
56
అలర్జీలు - తీవ్రమైన చర్మ సమస్యలు

'ఇది సహజసిద్ధమైంది కదా.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు' అనుకోవడం పెద్ద తప్పు. కొందరికి మెహెందీలోని ప్రొటీన్లు పడవు. దీనివల్ల తల చర్మం ఎర్రబడటం, విపరీతమైన దురద, దద్దుర్లు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది 'కాంటాక్ట్ డెర్మటైటిస్' అనే తీవ్రమైన చర్మ సమస్యకు దారితీయొచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు 'ప్యాచ్ టెస్ట్' చేసుకోకుండా హెన్నా వాడటం ప్రమాదకరం.

66
మరి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెన్నా ఎలా వాడాలి..?

మెహెందీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ వాడే పద్ధతి మార్చుకోవాలి. నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి మాత్రమే హెన్నా వాడండి.  మెహెందీ మిశ్రమంలో పెరుగు, గుడ్డులోని తెల్లసొన లేదా కొబ్బరి నూనె కలపడం వల్ల జుట్టు పొడిబారకుండా చూసుకోవచ్చు.  మార్కెట్లో దొరికే 'ఇన్‌స్టంట్ మెహెందీ' లేదా 'బ్లాక్ మెహెందీ'లో PPD అనే ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. ఎప్పుడూ స్వచ్ఛమైన గోరింటాకు పొడినే వాడండి. 

Read more Photos on
click me!

Recommended Stories