Beauty Tips: వేడికి పెదాలు పగులుతున్నాయా..? ఇది రాస్తే చాలు
పెదాలు పగిలి నొప్పి పెడుతున్నాయా? ఏం రాస్తే.. మీ పెదాలు మళ్లీ మృదువుగా మారతాయో తెలుసా? అసలు పెదాలు పగలకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు పెదాలకు ఏం రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పెదాలు పగిలి నొప్పి పెడుతున్నాయా? ఏం రాస్తే.. మీ పెదాలు మళ్లీ మృదువుగా మారతాయో తెలుసా? అసలు పెదాలు పగలకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు పెదాలకు ఏం రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండాకాలంలో ఎండల వేడి తట్టుకోవడం అంత ఈజీ కాదు. బయట ఎండలే తట్టుకోలేకపోతున్నాం అంటే.. శరీరం కూడా వేడి చేస్తూ ఉంటుంది. దీని వల్ల పెదాలు ఎండిపోవడం, పగలడం లాంటివి జరుగుతాయి. పెదాలు పగులినప్పుడు చాలా మంది లిప్ బామ్ రాస్తూ ఉంటారు. దీని వల్ల పెదాలు మృదువుగా మారతాయని నమ్ముతారు. కానీ.. అవి కాసేపు మాత్రమే పెదాలను మృదువుగా ఉంచుతాయి. కానీ పెదాలు పగులినప్పుడు వాటికి సరైన సంరక్షణ అవసరం. అంటే, పగిలిన పెదాలపైన డెడ్ స్కిన్ ని తొలగించాలి. అప్పుడే పెదాలు ఎప్పటిలా మళ్లీ మృదువుగా మారతాయి. మరి, దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పెదాలు పగులినప్పుడు ఏం చేయాలి?
1.పెదాలకు నూనె రాయండి...
మీ పెదాలు పగిలిన వెంటనే నూనె రాయాలి. తర్వాత చేతులతో తేలిక మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసి, మృదువైన వస్త్రంతో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై పేర్కొన్న దుమ్ము పూర్తిగా తొలగిపోతుంది.
మీ పెదవులను స్క్రబ్ చేయండి.
కాఫీ లేదా తేనెతో చక్కెరను కలిపి మీ పెదవులపై అప్లై చేసి సున్నితంగా రుద్దండి. ఇది పెదాలపై డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. దీని వల్ల పెదాలు మృదువుగా కనపడతాయి.
మీ పెదాలను శుభ్రం చేయండి.
ఇప్పుడు మీ పెదాలను గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ పెదాలను తేమగా ఉంచుతుంది.
మాయిశ్చరైజర్ ఉపయోగించండి.
కొబ్బరి నూనె లేదా ఏదైనా ఇతర మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ లేదా సహజ మాయిశ్చరైజర్‌ను పెదాలకు రాయండి. ఇది మీ పెదాలను హైడ్రేట్ గా ఉంచుతుంది.
మీ పెదాలు ఎప్పటికీ పగలకూడదంటే ఏం చేయాలి?
మీ పెదాలు ఎప్పటికీ పగలగుండా మృదువుగా ఉండాలి అంటే.. రాత్రి పడుకునే ముందు మీరు మీ పెదాలపై పాలు, తేనె మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాస్తే చాలు. లేదు అంటే మీరు కొబ్బరి నూనెలో కొద్దిగా కాఫీ పొడి వేసి.. ఆ మిశ్రమాన్ని మీ పెదాలకు రాసినా చాలు. ఈ మిశ్రమాన్ని రాసి సున్నితంగా రుద్దాలి.వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేసినా.. మీ పెదాలు మృదువుగా మారతాయి.