Hair Care: కలబంద జుట్టును ఇలా జుట్టుకు రాస్తే చాలు, ఒక్క వెంట్రుక కూడా రాలదు

Published : Apr 08, 2025, 01:41 PM IST

కలబంద జుట్టును బలంగా, మెరిసేలా,ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.జుట్టు రాలడం,చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. తాజా కలబంద ఆకులను కత్తిరించి జెల్ తీయండి లేదా మీరు దానిని కడిగి నేరుగా తలకు రాయచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్టే జుట్టు అసలు రాలదు.  

PREV
15
Hair Care: కలబంద జుట్టును ఇలా జుట్టుకు రాస్తే చాలు, ఒక్క వెంట్రుక కూడా రాలదు

ఎండాకాలంలో ఎండలకు చర్మం మాత్రమే కాదు, జుట్టు కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా జుట్టు డ్రైగా మారిపోయి.. నిర్జీవంగా మారిపోతుంది. దుమ్ము, యూవీ కిరణాలు, చెమట కూడా జుట్టు డ్యామేజ్ కి కారణం కావచ్చు. దీనితో పాటు.. మనం వాడే షాంపూలు, నూనెలు, హెయిర్ సీరమ్స్ అన్నీ కెమికల్స్ తో నిండి ఉండటం వల్ల కూడా జుట్టు మరింత ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది.అంతేకాదు..విపరీతంగా జుట్టు కూడా రాలిపోతుంది.మరి, ఇలా జరగకుండా, జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టాలంటే... కేవలం కలబంద రాస్తే చాలు. మరి, ఆ కలబంద జెల్ ని జుట్టుకు ఎలా రాయాలో తెలుసుకుందామా..


కలబంద జుట్టును బలంగా, మెరిసేలా,ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.జుట్టు రాలడం,చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. తాజా కలబంద ఆకులను కత్తిరించి జెల్ తీయండి లేదా మీరు దానిని కడిగి నేరుగా తలకు రాయచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్టే జుట్టు అసలు రాలదు.
 

25

వేసవిలో మీ జుట్టుకు కలబంద జెల్‌ను ఎలా అప్లై చేయాలి

కలబంద జెల్ మరియు కొబ్బరి నూనె
ఎండలకు మీ జుట్టు డ్రైగా మారి, చివర్లు  చిట్లిపోవచ్చు. అప్పుడు మీరు కలబంద గుజ్జులో నూనె కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవాలి. కలబందలో విటమిన్ ఎ, సి, ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తాయి. జుట్టును మృదువుగా కూడా మారుస్తాయి. జుట్టు పొడిబారే సమస్యను కూడా తగ్గిస్తుంది.ఈ మాస్క్ తయారు చేయడానికి, 1 టీస్పూన్ కొబ్బరి నూనెను 3 టీస్పూన్ల కలబంద జెల్‌తో కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ మాస్క్‌ను మీ జుట్టు,తలకు అప్లై చేసి 40 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి మీ జుట్టును కడగాలి.
 

35

కలబంద,ఉల్లిపాయ రసం రెసిపీ

కలబంద,ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని నివారించడానికి ఒక అద్భుతమైన కలయిక. కలబందలోని విటమిన్ B, యాంటీఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.పోషణను అందిస్తాయి. ఉల్లిపాయ రసంలో సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి,ఇవి జుట్టు తెల్లగా మారకుండా కాపాడతాయి. జుట్టు కుదుళ్లను కూడా బలంగా మారుస్తాయి.దీని కోసం 2 టీపూన్ల ఉల్లిపాయ రసాన్ని 3 టీస్పూన్ల కలబంద జెల్ తో కలిపి ఈ మిశ్రమాన్ని మీ తల,జుట్టుకు అప్లై చేయండి. 30-40 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి.
 

45
aleo vera

కలబంద జెల్ ,పెరుగు హెయిర్ మాస్క్ 
చుండ్రును వదిలించుకోవడానికి ,మృదుత్వాన్ని పెంచడానికి కలబంద ,పెరుగు హెయిర్ మాస్క్ ఒక గొప్ప మార్గం. కలబంద  యాంటీసెప్టిక్ లక్షణాలు దురదను తగ్గిస్తాయి, పెరుగు  యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తొలగిస్తాయి. పెరుగు ,కలబంద జెల్ ను సరైన నిష్పత్తిలో కలిపి బాగా కలపండి. మసాజ్ చేస్తున్నప్పుడు తల ,జుట్టుపై అప్లై చేయండి. 45 నిమిషాల తర్వాత, తేలికపాటి షాంపూ ఉపయోగించి మీ జుట్టును కడగాలి.

కలబంద ,నిమ్మరసం రెసిపీ
కలబంద ,నిమ్మరసం మిశ్రమం జిడ్డుగల తల ,చుండ్రుకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కలబంద  యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ లక్షణాలు తలపై చర్మాన్ని శుభ్రపరుస్తాయి, అయితే నిమ్మరసం ఆమ్ల లక్షణాలు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెసిపీ కోసం, 2-3 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ను 1-2 టేబుల్ స్పూన్ల నిమ్మరసంతో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి.
 

55

హెయిర్ సీరంకు బదులుగా కలబంద జెల్
వేసవిలో హెయిర్ సీరం ఉపయోగించే బదులు, కలబంద జెల్ వాడండి. ఇది జుట్టును తేమగా ఉంచుతుంది. పొడిబారకుండా నిరోధిస్తుంది.జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. కలబంద జెల్‌ను స్టైలింగ్ జెల్‌గా కూడా ఉపయోగించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories