వంటింట్లో ఈ పనులు చేస్తే చాలా డబ్బు ఆదా అవుతుంది

Published : Sep 12, 2025, 02:20 PM IST

money saving tips: డబ్బును ఆదా చేయడం కష్టమైన పని. పెరుగుతున్న ఖర్చులకు డబ్బును ఆదా చేయలేమని చాలా మంది అనుకుంటారు. కానీ ఆడవారు తలచుకుంటే కొన్నిచిన్న చిన్న వంటింటి టిప్స్ తో ఎంతో డబ్బును ఆదా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
16
డబ్బును ఆదా చేసే చిట్కాలు

వంటరూం చిన్నదే కావొచ్చు. కానీ ఇది మనతో ఎంతో డబ్బును ఖర్చు చేయిస్తుంది. బియ్యం, పప్పులు, ఉప్పులు అంటూ ఎన్నో వంట సామాన్లను కొంటుంటాం. ఇవి అయిపోతూనే ఉంటాయి. మనం కొంటూనే ఉంటాం. కానీ మనం చాలా డబ్బును వేస్ట్ చేస్తాం తెలుసా? చాలా మంది గమనించరు కానీ మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది. మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం ఎంతో ఖర్చును తగ్గించగలుగుతారు. ఎంతో డబ్బును ఆదా చేయగలుగుతారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
క్లీనింగ్ స్ప్రే

చాలా మంది వారం వారం లేదా నెలా నెలా క్లీనింగ్ స్ప్రేను కొంటుంటారు. నిజానికి దీనిని మన వంటింట్లోనే రూపాయి ఖర్చు లేకుండా తయారుచేయొచ్చు. అదికూడా మన ఇంట్లో ఉన్న వాటితో. నిమ్మతొక్కలు, వెనిగర్, నీళ్లను కలిపి క్లీనింగ్ స్ప్రేను తయారుచేసి వాడండి. దీనిలో మన ఆరోగ్యానికి హానికలిగించే ఎలాంటి కెమికల్స్ ఉండవు. అలాగే ఇది క్లీనింగ్ లో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది కూడా. దీన్ని తయారుచేసుకోవడం వల్ల మీరు కొంత డబ్బును ఆదా చేయగలుగుతారు.

36
సరైన పద్దతిలో నిల్వ చేయాలి

మనం సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్లే ఎన్నో ఆహార పదార్థాలు పాడైపోతుంటాయి. ముఖ్యంగా టమాటాలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు పాడైపోతుంటాయి. ఈ ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని చల్లగా లేదా పొడిగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. అదికూడా సపరేట్ గా. ఈ రెండింటిని కలిపి పెడితే ఉల్లిపాయల వల్ల ఆలుగడ్డలు తొందరగా మురిగిపోతాయి. ఇక ఆకుకూరలను తడి క్లాత్ లో చుట్టిపెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటివల్ల మీరు కొంత ఖర్చును తగ్గించుకోగలుగుతారు.

46
వేస్ట్ చేయకండి

తొందరగా పాడయ్యే ఆహారాలు ఉంటే వాటికి లేబుల్ తయారుచేసి అతికించండి. ఇలాంటి వాటిని చూసినప్పుడు మీకు వాటిని ఉపయోగించాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలు వేస్ట్ కాకుండా ఉంటాయి. దీనివల్ల ఫుడ్ వేస్టేజీ చాలా వరకు తగ్గుతుంది. అలాగే మిగిలిన ఆహారాలను పారేయడానికి బదులుగా వాటితో వెరైటీ ఫుడ్ ను తయారుచేసి తినండి. అంటే మిగిలిన అన్నంతో వెరైటీలు చేసి తినండి. వీటి ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోగలుగుతారు.

56
పెద్దమొత్తంలో కొనండి

పప్పులైనా, బియ్యమైనా వీటిని ఎక్కువగానే కొనాలి. కొంచెం కొంచెం కొంటే డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎక్కువ మొత్తంలో కొంటే మీకు డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి. డబ్బు ఆదా అవుతుంది. వీటికి పురుగులు పట్టకుండా ఉండటానికి గాలి వెళ్లని డబ్బాలో నిల్వ చేయాలి. అయితే మీరు వాడని వాటిని మాత్రం ఎక్కువ మొత్తంలో కొనకూడదు. మీకు తెలుసా? బల్క్ గా కొంటె ఎంతో డబ్బును ఆదా చేయగలుగుతారు.

66
ముందే ప్లాన్ చేసుకోండి

భోజనంలో ఏం తినాలో ముందు ప్లాన్ చేసుకుంటే బెటర్. వారంలో మీరు ఏం వండాలనుకుంటున్నారో నిర్ణయించుకుంటే అవే కొంటారు. దీనితో మీరు అనవసరంగా వేటీనీ కొనరు. దీనివల్ల మీరు ఈ రోజూ ఏం వండాలి అనే ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories