జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. స్త్రీ, పురుషులు ఎవరైనా సరే.. సరైన పోషకాలు తీసుకోకపోతే జుట్టు విపరీతంగా రాలుతుంది. ప్రోటీన్, రాగి, విటమిన్ బి, విటమిన్ సి, జింక్ , అయోడిన్ వంటి ముఖ్యమైన పోషకాలు జుట్టు పెరుగుదలకు అవసరం. వీటిలో ఏవైనా లోపం ఉంటే, జుట్టు పెరుగుదల ప్రభావితం కావచ్చు. దీని వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. దీనితో పాటు, ఒత్తిడి, హార్మోన్ల సమస్యలు మొదలైన వాటి వల్ల కూడా జుట్టు రాలుతుంది.
చాలా మంది మహిళలు స్నానం చేసి జుట్టును తడిగా ఉంచడం వల్ల , చౌకైన షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటారు.
బ్యూటీ సెలూన్‌లకు తరచుగా వెళ్లడం, బ్లో-డ్రై చేయడం, బ్లీచింగ్ చేయడం , మీ జుట్టుకు రంగు వేయడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. పోషకాలు తక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల కూడా జుట్టు రాలుతుంది.