Hair Growth: మెంతుల్లో ఇదొక్కటి కలిపి రాస్తే... జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!

Published : Oct 25, 2025, 01:54 PM IST

Hair Growth: మీ జుట్టును చాలా తక్కువ సమయంలో ఒత్తుగా, పొడుగ్గా పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే.. దాని కోసం మీరు మెంతులు, ఉల్లిపాయ వాడితే చాలు. ఈ రెండూ సహజంగా జుట్టును అందంగా మార్చడంలో సహాయం చేస్తాయి. 

PREV
13
Hair Growth

అందమైన జుట్టు పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ.. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు కుప్పలు తెప్పలుగా ఊడిపోతోంది. ఎన్ని రకాల మందులు వాడినా, ఖరీదైన ట్రీట్మెంట్లు తీసుకున్నా.. జుట్టు రాలడం తగ్గుతుందేమో కానీ, మళ్లీ మునుపటిలా మాత్రం పెరగడం లేదని చాలా మంది ఫీలౌతుంటారు. అలాంటివారు కేవలం, మనకు ఇంట్లో సహజంగా లభించే రెండు వస్తువులను వాడి... మీ జుట్టును అందంగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....

23
జుట్టుకు మెంతులు, ఉల్లిపాయలు ఎలా వాడాలి?

జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడానికి మెంతులు, ఉల్లిపాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రెండింటిలోనూ జుట్టు పెరగడానికి అవసరం అయ్యే పోషకాలు ఉంటాయి. వీటితో హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి ముందుగా.. రాత్రిపూట మెంతులను నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టిన మెంతుల్లో ఉల్లిపాయను తొక్కతీసి ముక్కలు వేయాలి. ఈ రెండింటినీ మెత్తని మిశ్రమంలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ తల, జుట్టు కుదుళ్లు మొత్తానికి బాగా పట్టించి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. సల్ఫేట్ లేని షాంపూలు ఎంచుకోవడం ఉత్తమం.

వారానికి రెండు, మూడుసార్లు ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే జుట్టు చాలా మృదువుగా మారుతుంది. రెండు, మూడు నెలలు క్రమం తప్పకుండా వాడటం వల్ల.... మంచి ఫలితాలను చూస్తారు. జుట్టు పెరగడం కూడా గమనిస్తారు.

33
జుట్టు పెరుగుదలకు ఇది ఎలా సహాయపడుతుంది?

ఉల్లిపాయలలోని సల్ఫర్ కొల్లాజెన్‌ను పెంచుతుంది. తలలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. అదనంగా, మెంతుల్లోని ముఖ్యమైన పోషకాలు, ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్, జుట్టు కుదుళ్ల నుంచి పెరుగడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, ఉల్లిపాయలలోని యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు , దురద వంటి ఏవైనా తలపై సమస్యలను నివారిస్తాయి. దీనివల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు లేకుండా వేగంగా జుట్టు పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories