పెదవులు నల్లగా ఉన్నాయని బాధపడుతున్నారా? ఇదిగో ఈ చిట్కాలు మీకోసమే

Published : Oct 12, 2025, 03:32 PM IST

Dark Lips:కొంతమంది పెదవులు ఎర్రగా ఉంటే.. మరికొంతమంది పెదవులు నల్లగా ఉంటాయి. దీనికి డీహైడ్రేషన్ నుంచి కాఫీని ఎక్కువగా తాగడం వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

PREV
15
పెదవులు నల్లగా ఉండటానికి కారణాలు

కొంతమంది పెదవులు నేచురల్ గా ఎర్రగా, అందంగా ఉంటాయి. కానీ కొంతమంది పెదవులు నల్లగా, పొడిబారి ఉంటాయి. ఇలా కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే డీహైడ్రేషన్, స్మోకింగ్, పోషకాహార లోపం, నకిలీ బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడకం, ఎండ, పొడి వాతావరణం వల్ల పెదవులు నల్లగా అవుతాయి. ఈ సమస్యను ఇంట్లోనే చాలా సింపుల్ పద్దతుల్లో తగ్గించుకోవచ్చు. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

25
నల్లని పెదవులను ఎర్రగా చేసే చిట్కాలు

బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెదవులకు పోషణను అందిస్తాయి. అలాగే దీనిలో ఉండే సహజ బెటానిన్ పెదవులకు ఎరుపు రంగును ఇస్తుంది. ఇందుకోసం బీట్ రూట్ ను తురిమి రసాన్ని తీసి పెదవులకు రాయండి. దీన్ని రాత్రిపూట పెట్టుకుని ఉదయం కడిగితే మంచిది. ఇలా ప్రతిరోజూ పెదవులకు పెట్టుకుంటే నల్లని పెదవులు ఎర్రగా అవుతాయి.

35
తేనె, నిమ్మరసం

తేనె, నిమ్మరసం కూడా నల్లని పెదవులు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. తేనె లో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు, నిమ్మరసం‌లో ఉండే సిట్రిక్ యాసిడ్ పెదవులపై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి. దీంతో మీ పెదవులపై నలుపు పోతుంది. ఇందుకోసం టీ స్పూన్ తేనెలో టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపండి. దీన్ని పెదవులకు అప్లై చేసి 15–20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా రోజుకు ఒక సారి చేస్తే సరిపోతుంది.

చక్కెర, తేనె స్క్రబ్

పెదవులపై ఉన్న చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి చక్కె, తేనె స్క్రబ్ కూడా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనితో పెదవులు నేచురల్ కలర్ ను పొందుతాయి. ఇందుకోసం టీ స్పూన్ చక్కెరలో టీ స్పూన్ తేనెను వేసి కలపండి. దీన్ని పెదవులకు నెమ్మదిగా పెట్టి రుద్దండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

45
ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె మసాజ్

బాదం నూనె, ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పెదవులను ఆరోగ్యంగా, మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. పెదవులు నేచురల్ గా ఎర్రగా కావాలంటే రాత్రి పడుకునే ముందు పెదవులకు బాదం లేదా ఆలివ్ ఆయిల్ ను పెట్టి కాసేపు మసాజ్ చేయండి. ఉదయాన్నే కడగండి. దీనివల్ల పెదవుల నలుపు తొలగిపోతుంది.

55
కలబంద జెల్

కలబంద మన జుట్టుకు, చర్మానికి, ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. దీనిలో శీతలీకరణ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది పెదవులు పొడిబారకుండా చేసి తేమగా ఉంచుతుంది. ఇది కూడా పెదవుల నలుపును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం తాజా కలబంద జెల్ ను తీసుకుని పెదవులకు పెట్టండి. దీన్ని రాత్రిపూట పెట్టుకుని ఉదయాన్నే కడిగేస్తే మంచిది. దీన్ని రోజూ పెట్టుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories