చీరకు తగ్గట్టు బ్లౌజ్ ను కుట్టించుకోవడం కాస్త కష్టమైన పనే. ఎందుకంటే బ్లౌజ్ చీర లుక్ ను మరికొంత పెంచుతుంది. చీర ఖరీదైనది కావొచ్చు, కాకపోవచ్చు. కానీ మీ బ్లౌజ్ స్టైలిష్ గా ఉంటే మీ లుక్ ను సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చు. బ్లౌజ్ ను ఎంచుకునేటప్పుడు డిజైన్ గురించి మాత్రమే కాకుండా మీ ఫిగర్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ శరీర పై భాగం బరువుగా ఉంటే.. మీరు మరింత శ్రద్ధ వహించాలి. ఇలాంటి మహిళలు ఎలాంటి బ్లౌజులను ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మోనోక్రోమిట్ లుక్
మోనోక్రోమిట్ లుక్ అంటే మీ చీర, బ్లౌజ్ రెండూ ఒకే రంగులో ఉండాలన్న మాట. ఒకే రంగులో ఉండటం వల్ల మీ ఫిగర్ ప్రత్యేకంగా హైలైట్ కాదు. అలాగే శరీరమంతా ఒకే ఆకారంలో కనిపిస్తుంది.
సింపుల్ బ్లౌజ్
ఎక్కువ డిజైన్ లేదా చీర నుంచి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ను ఎంచుకునే తప్పు మాత్రం చేయకండి. వీటికి బదులుగా కొంచెం బరువుగా ఉన్న చీరను కట్టుకోండి. అలాగే సింపుల్ డిజైన్ ఉన్న బ్లౌజ్ ను వేసుకోండి.
స్లీవ్
ఎద ఎక్కువగా ఉండే మహిళలు బ్లౌజ్ స్లీవ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మోచేతుల వరకు వచ్చే హాఫ్ స్లీవ్ బ్లౌజులు ధరిస్తే వాటి ఫిట్టింగ్ కాస్త వదులుగా ఉండాలి. చాలా టైట్ ఫిట్టింగ్ బ్లౌజులకు దూరంగా ఉండటమే మంచిది. మీరు స్లీవ్ లెస్ బ్లౌజ్ ను వేసుకోవాలనుకుంటే నూడిల్ స్ట్రాప్ కు బదులుగా కొంచెం వెడల్పాటి స్ట్రాప్ తో కూడిన బ్లౌజ్ ను ఎంచుకోండి.
నెక్ లైన్
మీ మెడను హైలైట్ చేసే నెక్లైన్లను ఎంచుకుంటే కూడా మీ లుక్ బాగుంటుంది. ఇందుకోసం వి నెక్, యు నెక్, స్క్వేర్ నెక్ ఉన్న బ్లౌజులు బాగా నప్పుతాయి. ఇది మీ ఫిగర్ కు బాగా కనిపిస్తుంది.
Fabric
బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నమహిళలు బ్రోకేడ్ బ్లౌజ్లు వంటి ఫాబ్రిక్ కు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే చేతులు, ఛాతీ మరింత లావుగా కనిపిస్తాయి. అందుకే తేలికపాటి, సౌకర్యవంతమైన ఫ్యాబ్రిక్ ఉన్న బ్లౌజులనే ఎంచుకోండి.