పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. అందుకే.. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని బాగా గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు.. అందంగా మెరిసిపోవాలని అనుకుంటారు. ఎక్కువ బంగారం అలంకరించుకొని మురిసిపోతూ ఉంటారు. అయితే...పెళ్లి కూతురి లుక్ పూర్తి అవ్వాలంటే.. కచ్చితంగా కొన్ని బంగారు ఆభరణాలను ధరించాలి. మరి, వధువుకు కావాల్సిన ఆభరణాలేంటో ఓసారి చూద్దాం..
1.నక్లెస్..
ప్రతి భారతీయ వధువుకు కచ్చితంగా అవసరమైన ఆభరణం నక్లెస్. వధువు లుక్ కంప్లీట్ చేయడానికి ఇది కచ్చితంగా అవసరం. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి నచ్చినది వారు ఎంచుకోవచ్చు. కానీ.. నక్లెస్ మాత్రం వధువుకి కచ్చితంగా అవసరమనే చెప్పాలి.
2.చెవిపోగులు..
మెడలో నక్లెస్ ఉండగానే సరిపోదు. దానికి మ్యాచింగ్ చెవిపోగులు ధరించినప్పుడే లుక్ అద్భుతంగా మారుతుంది. కాబట్టి.. ఎవరికి నప్పిన వాటిని వారు ఎంచుకోవచ్చు.మీ చెవిపోగులను జాగ్రత్తగా, మీ సౌకర్య స్థాయికి అనుగుణంగా ఎంచుకోండి. చెవిపోగులు.. మనకు చాలా అందాన్ని తీసుకువస్తాయి.
3.మాంగ్ టిక్కా
నుదుటిపై ధరించే మాంగ్ టిక్కా లేకుండా వధువు పూర్తి కాదు. పెళ్లి రోజు, పెళ్లి తర్వాత భారీ మాంగ్ టిక్కాను ఎంచుకోండి, మీ వానిటీలో ఎల్లప్పుడూ తేలికపాటి మాంగ్ టిక్కాను తీసుకెళ్లండి, ఎందుకంటే అవి వివిధ పరిమాణాలు, డిజైన్‌లలో వస్తాయి. వధువు నుదురు పరిమాణం ప్రకారం మాంగ్ టిక్కాను ఎల్లప్పుడూ కొనుగోలు చేయాలి. కాబట్టి, మాంగ్ టిక్కాను జాగ్రత్తగా ఎంచుకుని, అన్ని సమయాల్లో రాయల్ లుక్‌ను పొందండి.
gold ring
4.బంగారు ఉంగరం
మీరు చాలా ఉంగరాలు ధరించనట్లయితే, మీ పెళ్లి తర్వాత మీ అన్ని దుస్తులతో పాటుగా ఉండే ఒక పెద్ద , రీగల్ లుక్ రింగ్‌ని తీసుకోండి. నిశ్చితార్థపు ఉంగరం కాకుండా, ప్రతి వధువు కనీసం ఒక బంగారు ఉంగరాన్ని కలిగి ఉండాలి, మధ్యలో ముత్యం లేదా వజ్రం ఉంటే.. లుక్ అందంగా ఉంటుంది. ఇది ప్రతి దుస్తులకీ సెట్ అవుతుంది. మీకు రాయల్ లుక్ ని కూడా ఇస్తుంది.
5.గాజులు..
కొత్తగా పెళ్లయిన వధువు చేతినిండా గాజులు ఉంటే వచ్చే అందమే వేరు. మట్టిగాజులతోపాటు.. మిరుమిట్లు గొలిపే బంగారు గాజులను కూడా జత చేయాలి. మిరుమిట్లు గొలిపే ఈ కంకణాలు, మీరు కొత్తగా పెళ్లయిన వారని, మెహందీతో అందంగా కనిపిస్తున్నారని తెలియజేస్తుంది.