రిచ్ అండ్ రాయల్ లుక్ కోసం ఈ రంగు చీరలను, డ్రెస్సులను ట్రై చేయండి

First Published Jan 2, 2024, 5:04 PM IST

పెళ్లిళ్లు, ప్రత్యేక సందర్భాల్లో డిఫరెంట్ గా, కాస్త రిచ్ గా కనిపించాలనుకుంటే బట్టల స్టైల్ కంటే వాటి రంగులపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వీటి పైకి మీరు యాక్సెసరీలను కూడా ఎక్కువగా ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. 

హై-ఫై పార్టీకి కొన్ని రకాల డ్రెస్సులను వేసుకెళ్తే మీ లుక్ బ్యూటీఫుల్ గా కనిపిస్తుంది. కానీ చాలా మందికి ఎలాంటి దుస్తులను వేసుకోవాలో  తెలియదు. అదా.. ఇదా అంటూ గందరగోళానికి గురవుతారు. అయితే స్టైల్ పై మీరు పెద్దగా దృష్టి పెట్టకుండా దుస్తుల రంగుపై దృష్టి పెట్టండి. అవును మీకు రిచ్ అండ్ రాయల్ లుక్ ఇచ్చే కొన్ని రంగులు ఉన్నాయి. మీరు ఈ రంగులను సాంప్రదాయ దుస్తుల్లోనే కాకుండా పాశ్చాత్య దుస్తుల్లో కూడా ప్రయత్నించొచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

undefined

మెటాలిక్ షేడ్స్

బంగారం, రాగి, వెండి వంటి షేడ్స్ మీకు రిచ్ లుక్ ను ఇస్తాయి. పెళ్లి, పండుగలో డిఫరెంట్ లుక్ లో కనిపించాలనుకుంటే ఈ కలర్ చీర, సూట్ లేదా లెహంగాను ఎంచుకోండి. వీటిని పార్టీలకు కూడా వేసుకెళ్లొచ్చు. 

డీప్ పర్పుల్

మీ రంగు ఫెయిర్ గా ఉంటే మీ వార్డ్ రోబ్ లో డీప్ పర్పుల్ కలర్ డ్రెస్సులను లేదా చీరలను ఖచ్చితంగా చేర్చండి. ఈ రంగు చాలా క్లాసీగా కనిపిస్తుంది. మీరు లేత పర్పుల్ షేడ్ ను కూడా ఉపయోగించొచ్చు.
 

ఎమరాల్డ్ గ్రీన్

ఎమరాల్డ్ ఆకుపచ్చ కూడా ఒక రకమైన విస్తారమైన రంగు. సంప్రదాయ దుస్తుల నుంచి పెళ్లిలో పార్టీ దుస్తుల వరకు ఈ రంగును ప్రయత్నించొచ్చు. డిఫరెంట్ కలర్ జ్యూయలరీతో రెడీ అవ్వండి. ఎందుకంటే ఇందులో మీరు మరింత అందంగా కనిపిస్తారు.
 

రాయల్ బ్లూ

పేరుకు తగ్గట్టుగానే ఈ రంగు మీకు రాయల్ లుక్ ను ఇస్తుంది. రిచ్ లుక్ కావాలనుకునే ప్రతి సందర్భాల్లో ఈ రంగు చీర లేదా డ్రెస్సులను వేసుకెళ్లండి. 
 

click me!