Rose Water: రోజ్ వాటర్ ఇలా రాస్తే, ఒక్క వెంట్రుక కూడా రాలదు..!

Published : May 14, 2025, 06:02 PM IST

ఇప్పటి వరకు మీరు రోజ్ వాటర్ ని మీ ఫేస్ కి వాడి ఉంటారు. కానీ.. జుట్టుకు ఎప్పుడూ వాడలేదు కదా.. కానీ.. ఆ రోజ్ వాటర్ లో కొన్ని కలిపి రాస్తే కచ్చితంగా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం పక్కా.

PREV
16
Rose Water: రోజ్ వాటర్ ఇలా రాస్తే, ఒక్క వెంట్రుక కూడా రాలదు..!

ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఇలా జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉండొచ్చు. పోషకాహారం తీసుకోకపోవడం, హెయిర్ కేర్ తీసుకోకపోవడం, వాతావరణ మార్పులు వంటివి కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు.  చాలా మంది హెయిర్ లాస్ అవ్వగుండా ఉండేందుకు మార్కెట్లో దొరికే చాలా రకాల  ఉత్పత్తులను వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల ప్రయోజనం ఉంటుందో లేదో తెలీదు కానీ రోజ్ వాటర్ వాడితే, జుట్టు రాలడం ఆగిపోవడమే కాదు, ఒత్తుగా, పొడవు కూడా పెరుగుతుంది. 
 

26

ఇప్పటి వరకు మీరు రోజ్ వాటర్ ని మీ ఫేస్ కి వాడి ఉంటారు. కానీ.. జుట్టుకు ఎప్పుడూ వాడలేదు కదా.. కానీ.. ఆ రోజ్ వాటర్ లో కొన్ని కలిపి రాస్తే కచ్చితంగా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం పక్కా. మరి, దానిని జుట్టుకు ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం...

రోజ్ వాటర్  పోషక విలువలు:

రోజ్ వాటర్ విటమిన్ ఎ, బి3, సి , విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీని తేమ లక్షణాలు జుట్టు ఆరోగ్యానికి గొప్పగా పని చేస్తాయి. రోజ్ వాటర్ జుట్టు కి  సహజ మెరుపును పెంచుతుంది, జుట్టును మృదువుగా చేస్తుంది, జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది  జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
 

36

రోజ్ వాటర్ ఎలా వాడాలి?

రోజ్ వాటర్ (Rose Water) అనేది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చే సహజమైన చిట్కాలలో ఒకటి. ఇది తల చర్మాన్ని శుభ్రపరచడం, తేమ అందించడం, వృద్ధిని ప్రోత్సహించడం వంటి లక్షణాలతో సహాయం చేస్తుంది. జుట్టు పొడవుగా పెరిగేలా రోజ్ వాటర్‌ని ఉపయోగించే కొన్ని సమర్థవంతమైన పద్ధతులు ఇవే:
 

46
rose water

1. తలచర్మానికి నేరుగా అప్లై చేయడం
శుభ్రంగా చేతులతో లేదా స్ప్రే బాటిల్‌లో తీసుకుని తలపై స్ప్రే చేయండి.

రెండు నుంచి మూడు నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేయండి.

ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

2. తలక్రిందుల మసాజ్ (Inversion Method)
తలను కిందికి వంచి రోజ్ వాటర్‌తో తలచర్మాన్ని మసాజ్ చేయండి.

ఈ విధానం రక్తప్రసరణను వేగంగా పెంచుతుంది.

3. హెయిర్ మాస్క్‌గా వాడటం
రోజ్ వాటర్ + ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె కలిపి హెయిర్ మాస్క్‌గా అప్లై చేయండి.

30 నిమిషాలు ఉంచి, తేలికగా షాంపూతో కడగండి.

ఇది జుట్టుకు పోషణ ఇస్తుంది.
 

56

4. షాంపూకి మిక్స్ చేయడం
మీరు వాడే షాంపూకి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి వాడితే తలచర్మం తేమగా, క్లీన్‌గా ఉంటుంది.

5. ఫైనల్ హెయిర్ రిన్స్‌గా వాడటం
తలస్నానానంతరం తక్కువగా డైల్యూట్ చేసిన రోజ్ వాటర్‌ని చివర్లో కడిగే నీటి స్థానంలో వాడవచ్చు.

ఇది జుట్టు మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

66
rose water

జాగ్రత్తలు:
న్యాచురల్ లేదా హోమ్‌మేడ్ రోజ్ వాటర్ ఉపయోగించాలి.

రోజూ కాదు కానీ వారంలో 2-3 సార్లు వాడటం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories