ఉసిరిక పొడి షాంపూకు మంచి ప్రత్యామ్నాయం. ఇది జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను నయం చేస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. రెండు లేదా మూడు టీస్పూన్ల ఉసిరిక పొడిని నీరు లేదా రోజ్ వాటర్ లో కలిపి, తల, జుట్టుకు పట్టించండి. ఒక గంట తర్వాత కడగాలి. దీని వల్ల మురికిని తొలగించి, జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.