ఈరోజుల్లో జుట్టురాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతోందని అంటూ ఉంటారు. మార్కెట్లో దొరికే అన్ని నూనెలు, షాంపూలు వాడాం అని అయినా కూడా ఈ సమస్య తగ్గడం లేదని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. అలాంటి వారు కేవలం ఈ రెమిడీతో రెండు రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
దాదాపు 25 సంవత్సరాలు దాటిన వారిలో జుట్టు రాలడం మొదలౌతుంది. కొందరికి రాలిన జుట్టు మళ్లీ పెరగొచ్చు. మరి కొందరికి పెరగక బట్టతలగా కూడా మారొచ్చు. ఈ జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో నూనెలు కాకుండా.. కొన్ని సహజ నివారణలు వాడితే చాలట. అవేంటో చూద్దాం.
1.కొబ్బరి పాలు..
కొబ్బరి పాలు వాడితే మీ జుట్టు రాలడం తగ్గుతుందని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే. కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీసి.. వాటిని తలకు పట్టించి మంచిగా మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
Hair Fall
2.ఉల్లిపాయ రసం…
ఉల్లిపాయ రసం అధిక సల్ఫర్ కంటెంట్ కారణంగా జుట్టు రాలడం తగ్గించడానికి సహాయపడుతుంది, ఇది హెయిర్ ఫోలికల్స్‌కు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది..
3.కలబంద గుజ్జు
కలబందలో నేరుగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇంకా, దాని ఆల్కలైజింగ్ లక్షణాలు తల చర్మం, జుట్టు pHని మరింత కావాల్సిన స్థాయికి తీసుకురావడంలో సహాయపడతాయి, ఇది జుట్టు పెరుగుదలను బాగా ప్రోత్సహిస్తుంది.
4.ఆయిల్ మసాజ్..
రోజూ కొన్ని నిమిషాల పాటు గోరువెచ్చని నూనెతో మీ తలకు మసాజ్ చేయడం వల్ల తలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కొబ్బరి నూనె చుండ్రును అదుపులో ఉంచుతుంది. జోజోబా నూనె, బాదం నూనె, ఆవాల నూనె, లావెండర్ నూనె లు కూడా వాడొచ్చు. జోజోబా నూనె ముఖ్యంగా మంచిది ఎందుకంటే ఇది తలపై చర్మాన్ని మారుస్తుంది. ఇది చుండ్రును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
hair fall
5.ఎగ్ మాస్క్…
ఈ హోం రెమెడీ, దాని వైవిధ్యాలతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్కృతులలో ఒక భాగం. ఇందులో ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇందులో సల్ఫర్, జింక్, ఐరన్, సెలీనియం, ఫాస్పరస్ ,అయోడిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి.