మనలో చాలామంది అందం కోసం రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కానీ కొన్ని సహజ పదార్థాలతో ఇంట్లోనే ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం
రోజంతా బయట తిరిగి ఇంటికి వచ్చాక అద్దంలో చూసుకుంటే.. మన ముఖం మనకే నచ్చదు. దుమ్ము, ధూళి, ఎండ వల్ల ముఖం నల్లగా మారిపోతుంటుంది. కానీ ఎంత నల్లగా మారిని నిమిషాల్లో ముఖం మెరిసిపోయేలా చేసే ఒక పదార్థం ఉంది. అదే బియ్యం పిండి. బియ్యం పిండిలో కొన్ని పదార్థాలను కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
బియ్యం పిండిలోని సమ్మేళనాలు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు
బియ్యం పిండిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఎరుపు, దురద, ఇతర చర్మ చికాకులను తగ్గిస్తాయి.
జిడ్డు చర్మానికి..
జిడ్డు చర్మం ఉన్నవారికి బియ్యం పిండి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనెను పీల్చుకుని మొటిమలను నివారిస్తుంది.
35
1. బియ్యం పిండి, పాలు ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో రెండు స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. దానికి సరిపడా పచ్చి పాలు పోసి బాగా కలపాలి. దాన్ని ముఖం, మెడపై రాసి 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. తేమను అందిస్తుంది. ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 2 స్పూన్ల బియ్యం పిండి, ఒక స్పూన్ తేనె, కొద్దిగా రోజ్ వాటర్ తీసుకోవాలి. వీటిని బాగా కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. తేనె చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
3. బియ్యం పిండి, పెరుగు ఫేస్ ప్యాక్
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. పెరుగు చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అదనపు నూనెను నియంత్రిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
55
ఇవి గుర్తుంచుకోండి!
- ఈ ఫేస్ ప్యాక్‌లను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వాడాలి.
- ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
- ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చర్మం పొడిబారకుండా ఉండటానికి మాయిశ్చరైజర్‌ను వాడాలి.
- చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ వాడాలి.