Face Glow: ఖరీదైన క్రీములు కాదు, ఇవి రాస్తే.. ముఖంపై ముడతలు రావు..!

Published : Jun 28, 2025, 01:10 PM IST

జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే.. సహజంగానే అందంగా కనపడతాం. అంతేకాకుండా.. కెమికల్స్ లేని.. సహజ ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల కూడా అందంగా మెరిసిపోతారు.

PREV
16
Face Pack

వయసుతో సంబంధం లేకుండా.. ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరూ తాము అందంగా, యవ్వనంగా కనిపించాలనే అనుకుంటారు. కానీ, అది సాధ్యం కాదు. వయసు పెరిగే కొద్దీ ముసలివాళ్లు అవ్వక తప్పదు. ముఖంలో ముడతలు రావడం చాలా సహజం. కానీ.. వీటిని పూర్తిగా రాకుండే ఆపలేం కానీ.. ఆలస్యం చేసే అవకాశం మాత్రం మన చేతుల్లోనే ఉంది. మనం మన లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటే కచ్చితంగా సాధ్యం అవుతుంది. చాలా మంది కేవలం వేల రూపాయలు ఖర్చు చేసే క్రీములు ముఖానికి రాస్తేనే అందంగా ఉంటాం అనే భ్రమలో ఉంటారు. కానీ, వాటి అవసరం లేకుండా కూడా అందంగా కనిపించొచ్చు. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే.. సహజంగానే అందంగా కనపడతాం. అంతేకాకుండా.. కెమికల్స్ లేని.. సహజ ఫేస్ ప్యాక్ లను వాడటం వల్ల కూడా అందంగా మెరిసిపోతారు.ముఖ్యంగా ముఖంపై ముడతలు రాకుండా కాపాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

26
1.బొప్పాయితో సహజ సౌందర్యం...

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.మరి, ఈ బొప్పాయిని ముఖానికి ఎలా వాడాలంటే.. బాగా పండిన మూడు ముక్కలను తీసుకొని మెత్తగా పేస్టులాగా చేయాలి. దానికి కొద్దిగా తేనె కూడా కలిపి ముఖానికి రాయాలి. మంచిగా ఐదు నిమిషాలపాటు రాసి మసాజ్ చేయాలి. తర్వాత 20 నిమిషాలపాటు అలానే వదిలేసి.. ఆ తర్వత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కనీసం వారానికి రెండుసార్లు ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ ముఖానికి రాయడం వల్ల..ముఖం యవ్వనంగా, అందంగా మెరుస్తుంది. ముడతలు వస్తాయనే భయం అక్కర్లేదు.

36
2.కీరదోసకాయ ఫేస్ ప్యాక్..

కీరదోసకాయ తురుము, పెరుగుతో కలిపి, మీ ముఖంపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలు బిగుతుగా ఉంటాయి. అలాగే, దోసకాయ శీతలీకరణ , హైడ్రేటింగ్ లక్షణాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ముఖం పై ముడతలు రాకుండా ఉంటాయి. ఫేస్ లో ఒక గ్లో వచ్చేస్తుంది.

46
కలబందతో ఫేస్ ప్యాక్

కలబంద: మీ ముఖం , మెడపై తాజా కలబంద జెల్‌ను అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి. తర్వాత, మీ ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోండి. ప్రతి రాత్రి పడుకునే ముందు కలబంద జెల్‌ను అప్లై చేయడం వల్ల మీ చర్మం మెరుగుపడుతుంది. దాని స్థితిస్థాపకత మెరుగుపడుతుంది. కలబందలోని తేమ మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు.

56
ముఖ సౌందర్యాన్ని పెంచే అరటి..

అరటి ఫేస్ ప్యాక్: పండిన అరటిపండును మెత్తగా చేసి, తేనెతో కలిపి, మీ ముఖంపై అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. మీ ముఖంపై ముడతలు తగ్గడానికి వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగించండి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల కూడా మీరు యవ్వనంగా కనిపిస్తారు.

66
శనగపిండితో మెరిసే చర్మం..

శనగ పిండి ఫేస్ ప్యాక్: ఒక గిన్నెలో 2 టీస్పూన్ల శనగ పిండిని రోజ్ వాటర్ , పెరుగుతో కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి, ఆపై మీ ముఖంపై స్క్రబ్ చేసి కడగాలి. శనగ పిండి చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories