Rashmika: బంగారం కాదు.. పెళ్లికి రష్మిక ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా?

Published : Feb 28, 2026, 06:14 PM IST

Rashmika:  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో విజయ్, రష్మిక వేసుకున్న బంగారం మాత్రమే కాదు, రష్మిక వేసుకున్న చెప్పులు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. 

PREV
13
విరోష్ జోడి..

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సాక్షాత్తు సీతారాములు, శివ పార్వతులే నేల మీదకు వచ్చి పెళ్లి చేసుకున్నట్లు ఉన్నారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  వీరి పెళ్లి తర్వాత వేడుకకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 

23
రష్మిక నగలే హైలెట్..

విజయ్- రష్మిక జంట పెళ్లిలో వేేసుకున్న నగలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.  వీరి పెళ్లి డిజైన్లు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆభరణాలను 10 నెలల పాటు ప్రత్యేక డిజైనర్లు ఈ టెంపుల్ డిజైన్ నగలను తయారు చేయడం విశేషం. ఇక.. వీరి నగల ఖరీదు దాదాపు రూ.10 కోట్లు అని తెలుస్తోంది. ఆమె కట్టుకున్న చీరను కూడా బంగారు దారాలతోనే నేయించడం విశేషం. 

వారు ధరించిన జ్యూవెలరీలో ఒక్క రాయి కూడా వాడలేదు. డైమండ్ జ్యూవెలరీ అస్సలు ధరించలేదు. డైమండ్స్ నెగిటివ్ ఎనర్జీని తెస్తాయని, వాటికి శీతల గుణం ఉంటుందని, వీరు ఎక్కువ బంగారానికే ప్రాధాన్యత ఇచ్చారు.

33
రష్మిక చెప్పుల ధరెంతో తెలుసా?

ఇవన్నీ ఒకెత్తయితే, రష్మిక ధరించిన చెప్పులపై ఇప్పుడు నెటిజన్ల కన్ను పడింది. గోల్డెన్ కలర్‌లోని ఈ చెప్పుల ధర కనీసం లక్ష రూపాయలైనా ఉంటుందని చాలామంది అనుకున్నారు.

అయితే, ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ తగిలింది. రష్మిక అభిమానులు ఈ చెప్పుల ధరపై రీసెర్చ్ చేశారు. ఇది 'అపరాజితా తూర్' బ్రాండ్‌కు చెందినవని తెలుసుకున్నారు. దీని ధర కేవలం 24,399 రూపాయలు మాత్రమే అని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇంత తక్కువ ధర చెప్పులు ఎందుకు ధరించిందని ప్రశ్నిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories