Rashmika: నేషనల్ క్రష్ బ్యూటీ వెనక సీక్రెట్ ఇదే, రోజూ ఏం తింటుందో తెలుసా?
రష్మిక మందన్నా తన ఫిట్నెస్ ని ఎలా కాపాడుకుంటుంది? రోజూ ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుంది అనే విషయాలు తెలుసుకోవాలని ఉందా? అయితే, ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోండి..
రష్మిక మందన్నా తన ఫిట్నెస్ ని ఎలా కాపాడుకుంటుంది? రోజూ ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుంది అనే విషయాలు తెలుసుకోవాలని ఉందా? అయితే, ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోండి..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కి పరిచయం అవసరం లేదు.దక్షిణాది సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి, బాలీవుడ్ లోనూ వరస సినిమాలతో దూసుకుపోతోంది. టాలెంట్, అందం, స్టైల్ అన్నీ సమపాళ్లలో ఉన్న బ్యూటీ రష్మిక. కెరీర్ పరంగా మంచి, మంచి సినిమాలు చేసుకుంటూ అదరగొడుతున్న రష్మిక.. తన ఫిట్‌నెస్, బ్యూటీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. మరి, రష్మిక తన అందాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేస్తుంది? ఎలాంటి ఆహారం తీసుకుంటుంది? అనే విషయాలు తెలుసుకుందాం..
షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా కూడా రష్మిక వ్యాయామం చేయడం మాత్రం ఆపదట. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ యోగా, కార్డియో వంటి వ్యాయామాలను చేస్తుంది. ఈ వ్యాయామాలు చేయడం వల్ల మన శరీరం కూడా తేలికగా ఉంటుంది. మెదడును కూడా రిలాక్స్ చేస్తాయి.రోజులో కనీసం 30 నిమిషాలు యోగా లేదా సైక్లింగ్ , స్విమ్మింగ్ చేయడం కూడా రష్మికకు అలవాటు.
కేవలం కార్డియో మాత్రమే కాదు.. వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తుంది. ఈ వెయిట్ లిఫ్టింగ్.. కండరాలను బలంగా, ఆకర్షణీయంగా ఉంచుతుంది. ఇది శరీరపు ఆకృతి మెరుగుపడేందుకు, మెటబాలిజం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది.రష్మిక తన ఇంట్లో కూడా రెసిస్టెన్స్ బ్యాండ్లతో సాధన చేస్తుంది. ఇవి తక్కువ శ్రమతో మంచి ఫలితాలు ఇచ్చే వ్యాయామ పద్ధతులు. ప్రత్యేకించి బరువు తగ్గే ప్రయత్నంలో సహాయపడుతుంది
రష్మిక తాను తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకుంటుంది. ముఖ్యంగా అల్పాహారంలో.. గుడ్లు, ఓట్స్ టోస్ట్, తాజా పండ్లతో ఆమెకు అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్ లభిస్తాయి. ఇవి శరీరానికి సరిపడే శక్తిని ఇస్తాయి.
ఇక లంచ్ లో ప్రోటీన్, ఫైబర్ కాంబినేషన్ లో ఆహారం తీసుకుంటుందట.రష్మిక మధ్యాహ్న భోజనంగా క్వినోవా, సలాడ్‌లతో పాటు గ్రిల్డ్ చికెన్ లేదా చేపలు తీసుకుంటుంది. ఈ భోజనం శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్, మంచి కొవ్వులు అందిస్తుంది.రాత్రి డిన్నర్ మాత్రం చాలా తేలికగా తీసుకుంటుందట.బ్రౌన్ రైస్, కాల్చిన కూరగాయలు, గ్రిల్డ్ ఫిష్ లేదా చికెన్ ఆమె ఆహారంలో ఉంటాయి.