Face Glow: ఏ సీరమ్ రాస్తే.. మీ అందం పెరగడం పక్కా..!

Published : Apr 03, 2025, 04:08 PM IST

అందాన్ని పెంచడంలో సీరమ్స్ బాగా సహాయపడతాయి. కేవలం అందాన్ని పెంచడానికి మాత్రమే కాదు.. మీ చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి. స్కిన్ ని టైట్ చేస్తాయి. 

PREV
15
Face Glow: ఏ సీరమ్ రాస్తే.. మీ అందం పెరగడం పక్కా..!

చర్మం యవ్వనంగా మెరిసిపోవాలని, అందంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. అయితే.. ఇలా అందాన్ని పెంచడంలో సీరమ్స్ బాగా సహాయపడతాయి. కేవలం అందాన్ని పెంచడానికి మాత్రమే కాదు.. మీ చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి. స్కిన్ ని టైట్ చేస్తాయి. ఫేస్ ఎప్పుడూ గ్లోయిగా మెరుస్తూ కూడా కనపడుతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ... ఏ సీరమ్ ముఖానికి రాయాలి అనే విషయంలో మాత్రం చాలా మందికి క్లారిటీ ఉండదు. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఇ ఈ రెండింటిలో ఏది రాస్తే ముఖంలో అందం పెరుగుతుంది అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.దానికి క్లారిటీ మనం ఇప్పుడు తెలుసుకుందాం..
 

25

రెండు విటమిన్లు అందాన్ని పెంచుతాయి. కానీ, వాటిని మన చర్మాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. మనకు ఏది కావాలి..? మన స్కిన్ కి ఏది సూట్ అవుతుంది అనే విషయాలు ముందు తెలుసుకోవాలి. మరి, మీకు ఈ రెండింటిలో ఏ సీరమ్ బెస్ట్ అనే విషయం ఇప్పుడు చూద్దాం

35
Vitamin C Serum

గ్లోయింగ్, టైట్ స్కిన్ కోసం పర్ఫెక్ట్ విటమిన్ సి సీరం
విటమిన్ సి ఒక పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, టైట్‌గా, యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది.

కొల్లాజెన్ బూస్ట్ చేస్తుంది – ఇది చర్మాన్ని టైట్‌గా, దృఢంగా చేస్తుంది. దీనివల్ల ముడతలు తగ్గుతాయి.

డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది – మీ చర్మంపై మచ్చలు ఉంటే, వాటిని తేలికపరచడంలో ఇది సహాయపడుతుంది.

సన్ డ్యామేజ్ నుంచి రక్షణ – సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.

తక్షణ గ్లో ఇస్తుంది – ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా, రిఫ్రెష్‌గా చేస్తుంది.

విటమిన్ సి ఎవరికి బెస్ట్?
మీ చర్మం నిస్తేజంగా, ముడతలు కలిగి ఉంటే లేదా టైట్నింగ్ అవసరమైతే, విటమిన్ సి సీరం బెస్ట్.
 

45
serum for face

డీప్ హైడ్రేషన్, ఏజింగ్ కంట్రోల్ కోసం విటమిన్ ఇ సీరం బెస్ట్
విటమిన్ ఇ ఒక హైడ్రేటింగ్, యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగిన విటమిన్. ఇది చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా చేస్తుంది.

ఇంటెన్స్ హైడ్రేషన్ – చర్మాన్ని లోతుగా తేమ చేస్తుంది. దీనివల్ల ఇది మృదువుగా, నునుపుగా ఉంటుంది.

యాంటీ ఏజింగ్ గుణాలు – చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఏజింగ్ సైన్స్‌ను తగ్గిస్తుంది.

డ్రై, సెన్సిటివ్ స్కిన్ కోసం బెస్ట్ – ఇది చర్మ తేమను కాపాడుతుంది. ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.

స్కిన్ రిపేర్ – సన్‌బర్న్, చర్మపు చికాకును తగ్గిస్తుంది.

విటమిన్ ఇ సీరం ఎవరికి బెస్ట్?
మీ చర్మం పొడిగా, సున్నితంగా లేదా త్వరగా ముడతలు పడేలా ఉంటే, విటమిన్ ఇ సీరం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

55

స్కిన్ టైట్ గా, యవ్వనంగా మారాలంటే..?
మీరు చర్మాన్ని టైట్ చేయడం, ప్రకాశవంతం చేయడానికే ప్రాధాన్యత ఇస్తే, విటమిన్ సి సీరం బెస్ట్. కానీ మీకు హైడ్రేషన్, ఏజింగ్ కంట్రోల్ కావాలంటే, విటమిన్ ఇ సీరం సరైన ఆప్షన్. రెండింటినీ ఒకేసారి ఉపయోగించవచ్చా అనే ప్రశ్న వస్తే? అవును! విటమిన్ సి, ఇ రెండూ కలిసి కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. చాలా సీరమ్‌లలో ఈ రెండు విటమిన్ల కాంబినేషన్ ఉంటుంది. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా, టైట్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories