Face Glow: బొప్పాయిలో ఇదొక్కటి కలిపి రాస్తే పది నిమిషాల్లో ముఖం మెరిసిపోతుంది..!

Published : Jul 21, 2025, 10:05 AM IST

కేవలం చిన్న బొప్పాయి ముక్క చాలు.. మన ముఖాన్ని మృదువుగా, మెరిచేలా చేయడానికి. అందులోనూ ఈ బొప్పాయిలో పాలు, తేనె కూడా కలిపి ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకుంటే మరింత యవ్వనంగా మెరిసిపోతారు.

PREV
14
papaya Face Pack

సహజంగా అందంగా మెరిసిపోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. వయసు పెరుగుతున్నా కూడా యవ్వనంగా కనిపించాలనే కోరిక ముఖ్యంగా అమ్మాయిల్లో ఎక్కువగా ఉంటుంది. దాని కోసం చాలా మంది వేల రూపాయలు ఖర్చు చేసి అయినా సరే... తమ అందాన్ని పెంచుకోవాలనే అనుకుంటారు. కానీ, కేవలం చిన్న బొప్పాయి ముక్క చాలు.. మన ముఖాన్ని మృదువుగా, మెరిచేలా చేయడానికి. అందులోనూ ఈ బొప్పాయిలో పాలు, తేనె కూడా కలిపి ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకుంటే మరింత యవ్వనంగా మెరిసిపోతారు.

24
బొప్పాయి తేనె,పాల ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి?

ముందుగా, పండిన బొప్పాయిని పూర్తిగా మెత్తని పేస్టులాగా మార్చుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఒక టీ స్పూన్ తేనె కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మన ముఖాన్ని తేమగా మారస్తుంది. అదేవిధంగా మృదువుగా కూడా మారుస్తుంది. దీని తర్వాత అదే మిశ్రమంలో పాలు కూడా కలపాలి. పాలు కలపడం వల్ల సహజ క్లెన్సర్ పని చేస్తుంది. చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఈమూడు పదార్థాలను బాగా కలిపినప్పుడు మంచి క్రీమ్ లాగా తయారౌతుంది. రసాయనాలు లేకుండా తయారు చేసుకున్న ఈ క్రీమ్ మన ముఖాన్ని సహజంగా మెరిచేలా చేస్తుంది.

34
ఈ ఫేస్ ప్యాక్ ని ముఖానికి ఎలా అప్లై చేయాలి?

ఈ సహజ ఫేస్ ప్యాక్‌ను మీ ముఖం, మెడ అంతటా సమానంగా అప్లై చేయండి. చర్మం లో బాగా కలిసిపోయేలా తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. ఉత్తమ ఫలితాల కోసం, దీన్ని దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచండి. 20 నిమిషాల తర్వాత, మీ ముఖాన్ని మంచినీటితో కడుక్కోండి. పది నిమిషాల తర్వాత మీ ముఖంలో గ్లో స్పష్టంగా కనపడుతుంది. ఖరీదైన క్రీములు రాసినా రానంత గ్లో ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ తో సాధ్యం అవుతుంది. అయితే, దీనిని ముఖానికి రాసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు.

44
పది నిమిషాల్లో ముఖాన్ని మెరిపించే ఫేస్ ప్యాక్..

బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ , విటమిన్లు.. మీ చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడంలో సహాయపడతాయి. వారానికి రెండు, మూడుసార్లు ఈ ఫేషియల్ ముఖానికి రాయడం వల్ల.. మీ చర్మం ప్రకాశవంతంగా మారుస్తుంది. డ్రై స్కిన్ సమస్య ఉన్నవారికి కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ ముఖాన్ని మృదువుగా మార్చడమే కాదు...బంగారంలా మెరుస్తూ కనిపించేలా చేస్తుంది. ఏదైనా ఫంక్షన్ ఎక్కువగా సమయం లేనప్పుడు పది నిమిషాల ముందు ఈ ఫేస్ ప్యాక్ రాసుకున్నా కూడా మీరు అందంగా కనిపిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories