ఇది తనకో ఉద్యోగం మాత్రమే కాకుండా, పిల్లలకు అందించదలచిన ఒక విలువైన వారసత్వమని శ్లోకా అంటారు. "అమ్మగా నేను ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, మీరు పాఠశాలకు వెళ్లాలి అని నా పిల్లలకు చెప్పడంలో గర్వపడతాను. మనమంతా ఎదుగుదల కోసం పని చేస్తున్నామన్న సందేశాన్ని నేను వారికి ఇవ్వాలనుకుంటున్నాను,” అని ఆమె పేర్కొన్నారు. “మీరు నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు, దానివల్ల ప్రభావితమయ్యే ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తీసుకురాగలుగుతారు. ఇదే ఉత్తమమైన వారసత్వం” అని దీనినే తాను ఎక్కువగా నమ్ముతుంటాను అని చెప్పారు.
కుటుంబాన్నీ, కెరీర్ ని బ్యాలెన్స్ చేయడం...
తాను ఇద్దరు పిల్లలకు తల్లిగా వారి బాగోగులు చూసుకుంటూ, ఇటు కెరీర్ పై ఫోకస్ పెట్టడానికి తన భర్త ఆకాష్ సహకారం ఎంతో ఉందని శ్లోకా చెప్పారు. “ఆయన నాకు అండగా ఉండటమే కాకుండా, నాకు ప్రేరణనిచ్చే వ్యక్తి,” అని పేర్కొన్నారు.