Skin Care: రాత్రి పడుకునే ముందు ఈ నూనె ముఖానికి రాస్తే చాలు
మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు, మరి, రాత్రి పడుకునే ముందు మన ముఖానికి ఏం రాస్తే.. ఉదయానికి మన చర్మం మరింత అందంగా కనపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు, మరి, రాత్రి పడుకునే ముందు మన ముఖానికి ఏం రాస్తే.. ఉదయానికి మన చర్మం మరింత అందంగా కనపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
అందంగా ఉండాలని, అందంగా కనిపించాలనే కోరిక లేని మహిళలు ఎవరైనా ఉంటారా? మార్కెట్లో దొరికే సీరమ్స్, క్రీమ్స్ ఇలా అన్నీ రాసైనా సరే.. యవ్వనంగా కనిపించాలని తహతహలాడుతూ ఉంటారు. అయితే.. ఖరీదైన క్రీములు, సీరమ్స్ అవసరం లేకున్నా.. మనం యవ్వనంగా, ముడతలు లేకుండా.. మన అసలు వయసు కంటే పదేళ్లు తక్కువగా కనిపించేలా చూసే నూనె ఒకటి ఉంది. అదే కొబ్బరి నూనె. మరి, దీనిని ముఖానికి రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చద్దాం..
మార్కెట్లో రకరకాల నూనెలు దొరుకుతాయి. కానీ చాలా మంది కొబ్బరి నూనెనే వాడుతున్నారు. మన అమ్మమ్మల కాలం నుండి కొబ్బరి నూనెను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇందులో చాలా మంచి గుణాలు ఉన్నాయి. కొబ్బరి నూనెను జుట్టుకు రాస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.జుట్టు నల్లగా ఉంటుంది. స్మూత్‌గా, షైనింగ్‌గా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అందుకే చాలా మంది కొబ్బరి నూనెనే జుట్టుకు రాస్తారు. కానీ ఇది జుట్టుకు మాత్రమే కాదు, చర్మానికి కూడా మంచిది.
నిపుణుల ప్రకారం, కొబ్బరి నూనె చర్మానికి చాలా మంచిది. ఇది చర్మం పొడిబారకుండా చేస్తుంది. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ముఖానికి కొబ్బరి నూనె ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం.
ముఖానికి కొబ్బరి నూనె రాయడం వల్ల కలిగే లాభాలు
చర్మ సమస్యలు తగ్గుతాయి
శుద్ధమైన కొబ్బరి నూనె చర్మానికి చాలా మంచిది. చర్మ సమస్యలను త్వరగా నయం చేస్తుంది. దీన్ని ఉపయోగిస్తే చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. చలికాలంలో చర్మం పొడిబారడం, మందంగా అవ్వడం తగ్గుతుంది.
చర్మానికి తేమను ఇస్తుంది
కొబ్బరి నూనె చర్మానికి మంచి పోషణను ఇస్తుంది. ఈ నూనెలో విటమిన్ ఇ, ప్రో విటమిన్ ఎ, పాలీఫెనాల్స్ ఉన్నాయి. నొప్పి నివారిణి, వాపు నివారిణి, క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మానికి తేమను ఇస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారకుండా చేస్తుంది.
వయస్సు పెరగడాన్ని తగ్గిస్తుంది
కొబ్బరి నూనెలో బ్యాక్టీరియా విరోధి, వాపు నివారిణి, తేమను ఇచ్చే గుణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి తేమను ఇచ్చి, చర్మ సమస్యలను తగ్గిస్తాయి. రాత్రి ముఖానికి కొబ్బరి నూనె రాస్తే కొల్లాజెన్ ఉత్పత్తి ఎక్కువై చర్మానికి రక్షణ లభిస్తుంది.
రాత్రి ముఖానికి కొబ్బరి నూనె ఎలా రాయాలి?
ముఖ చర్మం పొడిబారితే, కొబ్బరి నూనె చర్మానికి మంచి పోషణను ఇస్తుంది. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెకు అలోవెరా జెల్, బియ్యం నీరు, గ్లిసరిన్ కలిపి క్రీమ్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనెను ముఖానికి రాసి మసాజ్ చేసి రాత్రంతా అలాగే వదిలేయవచ్చు.