Hair Care: హెయిర్‌ పుల్లింగ్‌ తో జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు...తెలుసా!

Published : Jul 04, 2025, 02:32 PM IST

హెయిర్ పుల్లింగ్, తల తట్టడం, ప్రాణ ముద్ర వంటి సహజ టెక్నిక్‌లు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కొన్ని నిమిషాలే సరిపోతుంది

PREV
17
జుట్టు రాలడం

ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, రోజూ జుట్టు సంరక్షణకి సమయం కేటాయించకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతోంది. చాలా మంది స్నానానికి వెళ్లినప్పుడు లేదా జుట్టు దువ్వినప్పుడు రాలిపోతున్న జుట్టును చూసి టెన్షన్ పడతారు. అయితే, ఈ సమస్యకు సహజమైన పరిష్కారాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇంట్లోనే పాటించే కొన్ని సరళమైన టెక్నిక్‌లతో జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.

27
హెయిర్ పుల్లింగ్ టెక్నిక్‌ ద్వారా జుట్టు బలపరిచే అవకాశం

హెయిర్ పుల్లింగ్ అనే టెక్నిక్‌లో  జుట్టును తేలికగా లాగడం జరుగుతుంది. దీని ద్వారా జుట్టు మూలాలు మరింత బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ కోసం మొదట జుట్టును రెండు సమాన భాగాలుగా విడదీయాలి. తర్వాత రెండు చేతులతో రెండు భాగాలను పట్టుకుని తేలికగా వ్యతిరేక దిశల్లో లాగాలి. ఈ చర్యను రోజూ రెండు నిమిషాలపాటు చేసినప్పుడు జుట్టు రాలడంలో తేడా కనిపించవచ్చు. ఇది జుట్టులో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే, గట్టిగా లాగకూడదు.

37
తల తట్టడం ద్వారా ఒత్తిడి తగ్గడం, జుట్టు పెరుగుదల

తలపై వేళ్లతో సున్నితంగా తట్టడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు. ఈ టెక్నిక్ ద్వారా తల చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది జుట్టు బలపడడానికి దోహదపడుతుంది. రెండు చేతులతో తలపై వేళ్లతో నెమ్మదిగా తట్టాలి.  ఈ చర్యను రోజూ ఒక్క నిమిషం పాటు చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, జుట్టు పెరుగుతుంది. ముఖ్యంగా పని ఒత్తిడిలో ఉండే వారికీ ఇది సహాయకారి.

47
వెనుక నుంచి మొదలుకొని పైవైపునకు దువ్వడం

చాలామంది జుట్టును సరిగ్గా దువ్వకుండా జుట్టు పోయిందని ఫిర్యాదులు చేస్తుంటారు. వాస్తవానికి దువ్వే విధానం కూడా చాలా ముఖ్యం. వెనుక నుంచి మొదలుకొని పై వైపునకు దువ్వడం వల్ల జుట్టులో చిక్కులు సులభంగా తీసేయోచ్చు.ఇది జుట్టు చిట్లడం కూడా తగ్గుతుంది. దువ్వే సమయంలో ఓ బలంగా కాకుండా ఓ మోస్తరుగా దువ్వుకోవాలి. రోజూ రెండు నిమిషాలు ఇలా దువ్వడం వల్ల జుట్టు మెత్తగా, ఆరోగ్యంగా ఉంటుంది.

57
ప్రాణ ముద్రతో శక్తి ప్రసరణ, హార్మోన్ల సమతుల్యత

ప్రాణ ముద్ర అనే పద్ధతి ద్వారా శరీరంలో శక్తి చక్కగా ప్రసరిస్తుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గడం, శరీరంలోని హార్మోన్లు సరిగ్గా పనిచేయడం జరుగుతుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి ముఖ్యమైన అంశం. ఈ ముద్రను చేయాలంటే, కూర్చున్న స్థితిలో రెండు చేతుల బొటనవేలితో చూపుడు, మధ్యవేళ్లను కలిపి మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. రోజూ పదినిమిషాలపాటు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. ఇది ధ్యానం చేసే సమయంలో కలిపి చేయవచ్చు.

67
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జుట్టును లాగేటప్పుడు గట్టిగా లాగకూడదు. ఎందుకంటే గట్టిగా లాగితే మూలాలు దెబ్బతిని, మరింత జుట్టు పోవచ్చు. అలాగే తల తట్టడంలోనూ బలంగా చేయకుండా, తేలికగా చేయాలి. ప్రతి టెక్నిక్‌ను ఓ మోస్తరుగా, నిరంతరంగా పాటించినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రెండు రోజులు చేసి ఆపేస్తే ఉపయోగం ఉండదు.

77
జీవనశైలి మార్పులు

ఈ టెక్నిక్‌లన్నీ సహాయపడతాయి కానీ జీవనశైలిలో మార్పులు చేయడం కూడా అంతే ముఖ్యమైంది. సరైన ఆహారం, నిద్ర, తగిన నీరు తాగడంతో పాటు ఈ టెక్నిక్‌లను కలిపి పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. రసాయనాలపై ఆధారపడకుండా, ఈ ప్రక్రియలు సహజ మార్గాల్లో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories