ఆయుర్వేదం ప్రకారం నా భి కి నువ్వుల నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు...
ఆయుర్వేదంలో, నా భిని 'నభి మర్మ' అని పిలుస్తారు.ఇది శరీరంలోని అన్ని ప్రధాన నరాలతో అనుసంధానించి ఉంటుంది. ఇది శరీరం కేంద్ర బిందువు, నాడీ వ్యవస్థ, జీర్ణక్రియ,పునరుత్పత్తికి సంబంధించిన అనేక నరాలు ఇక్కడే కేంద్రీకృతమై ఉంటాయి.నువ్వుల నూనె శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది.శరీరంలోకి లోతుగా చొచ్చుకుపోవడం ద్వారా కణాలకు మంచి పోషణ అందిస్తుంది.
నువ్వుల నూనె ఋతు నొప్పిని తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది?
నువ్వుల నూనె శరీరాన్ని లోపలి నుండి వేడి చేస్తుంది, ఇది గర్భాశయం కండరాలను సడలిస్తుంది.తిమ్మిరిని తగ్గిస్తుంది. నా భిపై పూయడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది. పీరియడ్స్ లో నొప్పిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వాడటం వల్ల హార్మోన్ల అసమతుల్యత ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇది PMS లక్షణాలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు.. ముఖంలో గ్లో కూడా తెస్తుంది. ముఖ్యంగా మొటిమలు, పిగ్మెంటేషన్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.