Hair Care: షాంపూలో ఇదొక్కటి కలిపి తలస్నానం చేస్తే.. జుట్టు స్మూత్ గా మారడం పక్కా

Published : Jan 15, 2026, 09:31 AM IST

Hair Care: చలికాలంలో జుట్టు అందంగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారా? అయితే.. దాని కోసం ఖరీదు అయిన ఉత్పత్తులు వాడాల్సిన అవసరం లేదు. మీరు వాడే షాంపూలో కేవలం ఒకే ఒకటి చేర్చితే చాలు. 

PREV
13
Hair Care

చలికాలం వచ్చిందంటే చాలు. చర్మంతో పాటు జుట్టు కూడా పొడిబారిపోతూ ఉంటుంది.జుట్టు చిట్లిపోవడం, కాంతిని కోల్పోవడం వంటి సమస్యలు మహిళలను వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుండి బయట పడటానికి మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, కండషనర్లు వాడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో దొరికే బియ్యం నీటితో మీ జుట్టును సహజంగా మెరిసేలా మార్చుకోవచ్చు.

23
బియ్యం నీరు- రోజ్ వాటర్ మిశ్రమం...

బియ్యం నీటిలో ఉండే అమినో యాసిడ్లు, విటమిన్లు జుట్టుకు పోషణను ఇస్తాయి. దీనికి రోజ్ వాటర్ తోడైతే జుట్టు పట్టు కొచ్చులా మృదువుగా మారుతుంది.

బియ్యాన్ని నానబెట్టండి: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

మిశ్రమం తయారీ: ఈ బియ్యం నీటిలో ఒక చెంచా రోజ్ వాటర్ (Rose Water) మీరు రెగ్యులర్‌గా వాడే కొద్దిపాటి షాంపూ వేసి బాగా కలపాలి.

33
ఉపయోగించే విధానం:

తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని జుట్టుకు, కుదుళ్లకు పట్టించి మెల్లగా మసాజ్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టుపై కనీసం 5 నుండి 7 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీనివల్ల జుట్టులోని మురికి పోవడమే కాకుండా, పోషకాలు లోపలికి చేరుతాయి.ఆ తర్వాత సాధారణ నీటితో జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి.

ఈ బియ్యం నీటిని జుట్టుకు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు..

మెరుపు (Shine): బియ్యం నీరు జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తుంది.

బలం: జుట్టు కుదుళ్లు దృఢంగా మారి, జుట్టు రాలడం తగ్గుతుంది.

మృదుత్వం: రోజ్ వాటర్ జుట్టును తేమగా ఉంచి, చిక్కులు పడకుండా చేస్తుంది.

ముఖ్యమైన జాగ్రత్తలు:

మైల్డ్ షాంపూ: మీ జుట్టు డ్యామేజ్ అవ్వకూడదు అంటే.. వీలైనంత వరకు గాఢత తక్కువగా ఉండే (Mild) షాంపూని ఎంచుకోవడం మంచిది.

ప్యాచ్ టెస్ట్: మీరు మొదటిసారి బియ్యం నీరు లేదా రోజ్ వాటర్ ఉపయోగిస్తుంటే, ముందుగా తల మీద ఒక చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసి, మీకు ఎలాంటి అలర్జీ లేదని నిర్ధారించుకున్నాకే పూర్తిస్థాయిలో వాడండి.

వారానికి ఎన్నిసార్లు?: ఉత్తమ ఫలితాల కోసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ పద్ధతిని అనుసరించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories