ప్రతి ఒక్కరూ అందంగా , యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. అంతేకాదు.. తమ జుట్టు కూడా చాలా పొడవుగా ఉండాలని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే.. ముఖం యవ్వనంగా మారడంతో పాటు..జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. అది మరేంటో కాదు.. ఆవ నూనె. మీరు చదివింది నిజమే.ఈ ఒరకర ఆవ నూనెతో మీ ముఖం అందంగా మారడంతో పాటు.. జుట్టు కూడా అందంగా మారుతుంది.
ఆవ నూనెలో మనకు అవసరం అయ్యే చాలా కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన చర్మానికీ, జట్టుకీ రెండింటికీ మంచి పోషణ ఇస్తుంది. ఈ నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని అందంగా మారుస్తుంది.
చర్మానికి, ఆవాల నూనె సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది, రంగును మెరుగుపరుస్తుంది. సూర్యరశ్మి నుండి రక్షణను అందిస్తుంది. ఇది మొటిమలు , ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. జుట్టుపై ఉపయోగించినప్పుడు, ఆవాల నూనె మూలాలను బలపరుస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, చుండ్రును నివారిస్తుంది.తెల్ల జుట్టు సమస్య అనేది ఉండదు.
ఆవ నూనె ఎలా వాడాలి..?
కొన్ని చుక్కల ఆవ నూనెను వేడి చేసి, మీ చర్మంలోని పొడి ప్రాంతాలపై మసాజ్ చేయండి.10-15 నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై తడిగా ఉన్న గుడ్డతో అదనపు భాగాన్ని తుడవండి. మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. సన్ స్క్రీన్ లా కూడా పని చేస్తుంది. దాని కోసం ఈ ఆవనూనెలో కొంచెం కలబంద జెల్ వేసి కలపాలి. బయటకు వెళ్లేటప్పుడు రాసుకుంటే సన్ స్క్రీన్ లా వర్క్ అవుతుంది. ఈ ఆవనూనె తో ఫేస్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు. టీ స్పూన్ ఆవ నూనెలో ఒక టీ స్పూన్ సెనగ పిండి, పసుసపు కలిపి ముఖానికి రాయాలి. 15 నిమిషాలు ముఖానికి రాసుకొని, తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. ముఖం అందంగా మెరిసిపోతుంది.
జుట్టు పెరుగుదలకు ఆవ నూనె..
ఆవ నూనెను కొబ్బరి లేదా ఆముదం నూనెతో సమాన భాగాలుగా కలిపి అప్లై చేయండి.మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి మీ తలకు మసాజ్ చేయండి.
రాత్రిపూట అలాగే ఉంచి మరుసటి రోజు కడిగేయండి. ఇలా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది.చుండ్రు పోవాలంటే... ఆవ నూనెలో కరివేపాకు, మెంతులు వేసి కాగపెట్టాలి. ఆ నూనె మీ తలకు రాసి.. గంట తర్వాత షాంపూ చేస్తే చాలు. రెండు, మూడు సార్లు చేస్తే చుండ్రు పోతుంది.
హెయిర్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల ఆవ నూనెలో అరటిపండు గుజ్జు, పెరుగు వేసి కలపాలి. దీనిని మీ జుట్టుకు అప్లై చేయండి. గంట తర్వాత తలస్నానం చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. ఇక.. ఆవ నూనెతో తెల్ల జుట్టు సమస్య ఉండకూడదు అంటే..
హెన్నా పౌడర్‌తో ఆవ నూనెను కలిపి హెయిర్ మాస్క్‌గా ఉపయోగించండి. గంట తర్వాత తలస్నానం చేస్తే చాలు. రెగ్యులర్ గా చేస్తే తెల్ల జుట్టు సమస్య అనేదే ఉండదు.