Legal rights: పెళ్లైన ప్రతి మహిళ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి

Published : Jun 24, 2025, 02:57 PM ISTUpdated : Jun 24, 2025, 05:45 PM IST

వివాహం తర్వాత మహిళలకు చట్టపరంగా లభించే కీలకమైన 6 హక్కుల వివరాలు తెలుసుకోండి. ప్రతి మహిళకు తెలియాల్సిన న్యాయ హక్కులు ఇవే. 

PREV
17
6 ముఖ్యమైన హక్కులు ఇవే

భారత రాజ్యాంగం మహిళల హక్కులను కాపాడేందుకు వివిధ చట్టాలను అమలు చేసింది. పెళ్లి అయిన తర్వాత భార్యకు భర్త పట్ల, ఆస్తిపై, జీవిత భద్రతపై,  విడాకుల సందర్భాల్లో కొన్ని ముఖ్యమైన న్యాయ హక్కులు ఉంటాయి. వివాహిత మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన హక్కులు ఇవే:

27
ఆర్థిక నిర్వహణ హక్కు (Right to Streedhan):

 స్త్రీధనం అనేది మహిళకు పెళ్లి సమయంలో ఇచ్చే ఆస్తి, నగదు, బంగారం, వస్తువులు. ఇవన్నీ ఆమెకు  సొంతమే. భర్త గానీ, అత్తింటివారు గానీ వీటిపై హక్కు చూపించలేరు. భారత శిక్షా సంహిత సెక్షన్ 14 ప్రకారం, వీటిని అడగడం నేరం.

37
నిర్భయంగా జీవించే హక్కు (Right to live with dignity and without cruelty):

వివాహిత మహిళలు గౌరవంగా, లైంగిక హింస లేకుండా జీవించే హక్కును కలిగి ఉంటారు. భారత శిక్షాసంహిత సెక్షన్ 498A ప్రకారం, భర్త లేదా అతని బంధువుల వల్ల వేధింపులు వస్తే, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

47
ఆలిమనీ హక్కు (Right to Maintenance):

 విడాకులు అయినా, విడిగా ఉండాల్సి వచ్చినా, భర్త భార్యకు జీవనోపాధి కోసం నెలవారీ భృతి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం ఇది అమలవుతుంది.

57
ఆస్తిపై హక్కు (Right to Matrimonial Home):

వివాహిత మహిళకు తన భర్త నివసిస్తున్న ఇంట్లో ఉండే హక్కు ఉంది. ఆ ఇంటి యజమాని భర్త కాని అయినా సరే, ఆమెను బయటకు పంపడం చట్టవిరుద్ధం.

67
పిల్లల కస్టడీ హక్కు (Right to Child Custody):

 విడాకుల సమయంలో పిల్లల సంరక్షణ హక్కు తల్లికి ఉండే అవకాశముంది. పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, విద్యను పరిగణలోకి తీసుకొని కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

77
విడాకులు తీసుకునే హక్కు (Right to Divorce):

భర్త నుంచి మానసిక, శారీరక హింస, అపోహలు,  వంటి కారణాల వల్ల విడాకులు కోరే హక్కు భార్యకు ఉంది. వివాహ చట్టాల ప్రకారం ఆమె కుటుంబ న్యాయస్థానంలో కేసు వేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories