సింక్ పైపును ఈజీగా ఎలా క్లీన్ చేయాలో తెలుసా?

First Published | Nov 22, 2024, 4:16 PM IST

కిచెన్ సింక్‌ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అందులో ఆహార పదార్థాలు జామ్ అవుతాయి. దీంతో పైపులోంచి నీళ్లు పోవు. అందుకే సింక్ పైపును ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఇంట్లోని మిగతా రూములతో పాటుగా కిచెన్ ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా కిచెన్ లోని సింక్ పైపును. అయితే చాలా మంది సింక్ ను మాత్రమే క్లీన్ చేసి దాని పైపును క్లీన్ చేయకుండా వదిలేస్తుంటారు. నిజానికి  దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ దీనివల్ల పైపుల్లో మురికి పేరుకుపోతుంది. కాబట్టి ఈ సింక్ పైపును చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

సింక్ కు ఉండే పైపు చాలా మెత్తగా, పల్చగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రతిరోజూ లేదా తరచుగా వాష్ చేస్తే అది తొందరగా పాడవుతుంది. అరిగిపోయి పనికిరాకుండా పోతుంది.అలాగని దాన్ని మొత్తమే క్లీన్ చేయకుండా వదిలేయకూడదు. అయితే సింక్ పైపు ఎక్కువ రోజులు రావాలంటే దీన్ని క్లీన్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్‌ని ఉపయోగించొచ్చు.


అల్యూమినియం ఫాయిల్

సింక్ పైపును శుభ్రం చేయడానికి మీరు అల్యూమినియం ఫాయిల్‌ని ఉపయోగించొచ్చు. దీనివల్ల పైపునకు ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఎక్కువ రోజులు వస్తుంది. ఇందుకోసం మీ పైపు పొడవును బట్టి అల్యూమినియం ఫాయిల్‌ని కట్ చేయండి. దీన్ని పైపు చుట్టూ చుట్టండి. దీంతో పైపు సురక్షితంగా ఉంటుంది.

అల్యూమినియం పాలియిల్ వల్ల కలిగే ప్రయోజనాలు:

దుర్వాసన సమస్య తగ్గుతుంది: సింక్‌లో గిన్నెలను కడుగుతున్నప్పుడు దానిలో గ్రీజు పేరుకుపోతుంది. దీనివల్ల సింక్‌లో నీళ్లు నిల్వ ఉంటాయి. అయితే మీరు అల్యూమినియం ఫాయిల్‌ని సింక్ పైపునకు గట్టిగా చుడితే దానిలో వేడి పెరగడం వల్ల గ్రీజు సులభంగా బయటకు రాదు. దీంతో సింక్‌లో నుంచి మురికి వాసన రాదు. 

ఎలుకల సమస్య ఉండదు

సింక్ పైపునకు అల్యూమినియం పాయిల్ ను చుట్టడం వల్ల వంటింట్లోకి ఎలుకలు వచ్చే బెదడ తగ్గుతుంది. ఎందుకంటే ఎలుకలు సింక్ కింద ఉండే పైపును కొరికి పాడుచేస్తాయి. మీరు గనుక సింక్ పైపునకు అల్యూమినియం ఫాయిల్‌ని చుడితే ఎలుకలు దానికి భయపడి పారిపోతాయి.

నీరు లీక్ కాదు

చాలా సార్లు సింక్ పైపు నుంచి వాటర్ లీకేజీ అవుతుంటాయి. మీరు గనుక ఈ పైపునకు అల్యూమినియం ఫాయిల్‌ని చుట్టినట్టైతే లీకేజీ సమస్యే ఉండదు. గిన్నెలు కడుగుతున్నప్పుడు వాటర్ లీకేజ్ అసలే ఉండదు. 

Latest Videos

click me!