3. టీ బ్యాగ్:
కొన్నిసార్లు అలసట, ఒత్తిడి కారణంగా ముఖం డల్ గా కనిపిస్తుంది. ఈ సందర్భంలో, మీరు టీ బ్యాగ్‌లను ఉపయోగించవచ్చు. టీ బ్యాగ్‌ని వేడి నీటిలో వేసి టీ తయారు చేయండి. టీ తయారు చేసిన తర్వాత, టీ బ్యాగ్ తీసివేసి చల్లబరచండి. చల్లటి టీ బ్యాగ్ తీసుకుని కళ్ల కింద లేదా ముఖంపై పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ కళ్ల కింద ఉబ్బడం, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది