హెయిర్ వాష్
ఆయిలీ జుట్టు చాలా తొందరగా మురికిగా మారుతుంది. ఎందుకంటే ఆయిలీ జుట్టుకు దుమ్ము, ధూళి బాగా అంటుకుంటాయి. వీటివల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా హెయిర్ ఫాల్ కూడా వస్తుంది. దీనికోసమని చాలా మంది ప్రతిరోజూ లేదా రోజు తప్పించి రోజు షాంపూతో తలస్నానం చేస్తుంటారు. కానీ జుట్టును ప్రతిరోజూ షాంపూతో క్లీన్ చేయకూడదు.
ఎందుకంటే దీనివల్ల కూడా నెత్తిమీద ఎక్కువ నూనె ఉత్పత్తి అవుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి వారానికి 2 సార్లు షాంపూతో తలస్నానం చేయండి. ఇంతకంటే ఎక్కువ సార్లు తలస్నానం చేస్తే జుట్టులో నూనె ఎక్కువగా పేరుకుపోతుంది. అలాగే మీ జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల మీరు మీ జుట్టును నచ్చిన విధంగా స్టైల్ చేయలేరు.