కిచెన్ సింక్ మనం రోజంతా వాడుతూనే ఉంటాం. దీనివల్ల సింక్ లో నుంచి నీళ్లు సాఫీగా పోకపోవడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు వస్తాయి. దీనికి అసలు కారణం.. గిన్నెలు తోముతున్నప్పుడు లేదా ప్లేట్ లో మిగిలిన ఫుడ్ ను అలాగే సింక్ లో వేయడం. దీనివల్లే సింక్ లో మురికి జామ్ అయ్యి నీళ్లు పోకుండా అవుతుంది.
ఈ ఆహారం సింక్ పైపు, డ్రైనేజీలో బాగా పేరుకుపోతుంది. దీన్ని గనుక సరిగ్గా శుభ్రం చేయకపోతే సింక్ లో నుంచి నీళ్లు పోకపోవడమే కాకుండా.. దాంట్లో నుంచి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంటుంది.
కిచెన్ సింక్ లో దుర్వాసన, నీళ్లు పోకపోవడం వంటి సమస్యలు దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటాయి. మరి ఈ సమస్యలను ఎలా సులువుగా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కిచెన్ సింక్‌లో దుర్వాసన, అడ్డంకులను తొలగించడం ఎలా?
కావలసిన పదార్థాలు
బేకింగ్ సోడా - 1 కప్పు
వేడి నీళళ్లు - 1 కప్పు
వెనిగర్ - అర కప్పు
నిమ్మరసం - 1 కప్పు
ఎలా క్లీన్ చేయాలి?
సింక్ ను క్లీన్ చేయడానికి ముందుగా సింక్ లో బేకింగ్ సోడాను వేయండి. ఆ తర్వాత దాంట్లో నిమ్మరసాన్ని చల్లి 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత వెనిగర్ ను కూడా సింక్ కు అప్లై చేసి కాసేపు వదిలేయండి. ఆ తర్వాత సింక్ లో వేడి నీళ్లు పోయండి. ఇప్పుడు సింక్ పైపును ఓపెన్ చేయండి. ఇలా చేస్తే సింక్ లో ఇరుక్కుపోయిన ఫుడ్ తొలగిపోతుంది. అలాగే సింక్ నుంచి దుర్వాసన రావడం కూడా తగ్గుతుంది.
కిచెన్ సింక్‌లో అడ్డంకులు, దుర్వాసన రాకుండా ఉండటానికి ఏం చేయాలి:
- సింక్ లోనుంచి దుర్వాసన రాకూడదంటే గిన్నెలు తోమెటప్పుడు మిగిలిన ఆహారాన్ని సింక్‌లో వేయకండి. దీన్ని బస్ట్ బిన్ లో వేయడం అలవాటు చేసుకోండి.
- అలాగే నెలకోసారి కిచెన్ సింక్ పైపును మార్చడం చాలా మంచిది. ఎందుకంటే సింక్ పైపులో మురికి, బూజు పేరుకుపోకుండా ఉంటాయి. ఒకేపైపును ఎక్కువ కాలం వాడితే సింక్ దుర్వాసన వస్తుంది. పైపులో ఫుడ్ కూడా అడ్డుపడుతుంది.
- ఇకపోతే ఎప్పటి గిన్నెలను అప్పుడే కడగండి. రెండు మూడు రోజులు వరకు క్లీన్ చేయకుండా పెట్టకండి.