బాత్ రూం బకెట్ , మగ్ ను సింపుల్ గా ఎలా క్లీన్ చేయాలో తెలుసా?

First Published | Nov 19, 2024, 2:34 PM IST

బాత్ రూంలో ఉన్న బకెట్, మగ్ ఎంత మురికిగా మారతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిపై సబ్బు, షాంపూ మరకలు అంటుకుంటాయి. అలాగే పసుపు పచ్చ మరకలు కూడా ఏర్పడతాయి. మరి వీటి మురికిని ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ప్రతి ఒక్కరూ ఇల్లును శుభ్రంగా సర్దుకుంటారు. నీట్ గా ఉంచుకుంటారు. కానీ ఇంటితో పాటుగా బాత్ రూం కూడా శుభ్రంగా ఉండాలి. అదొక్కటి నీట్ గా ఉంటే సరిపోదు. దానిలో ఉండే బకెట్, మగ్ కూడా క్లీన్ గా ఉండాలి. ఎందుకంటే బాత్ రూంలో ప్రమాదకరమైన క్రిమి కీటకాలు ఉంటాయి. అందుకే బాత్ రూం ను శుభ్రంగా ఉంచుకోవాలంటారు. 

చాలా మంది బాత్ రూం ను వారానికి రెండు మూడు సార్లు కడుతుంటారు. కానీ బాత్ రూం లో ఉండే బకెట్ ను, మగ్ ను మాత్రం అస్సలు క్లీన్ చేయరు. దీనివల్ల బకెట్, మగ్గు మురికిగా మారతాయి. వీటిపై తెల్లగా చాలా మందం మురికి పేరుకుగుతుంది. అలాగే పసుపు పచ్చ మరకలు కూడా ఏర్పడతాయి. 

ఇలాంటి  మొండి మరకలను క్లీన్ చేయడం కంటే అలాగే వదిలేయడం  మేలని చాలా మంది వాటిని క్లీన్ చేసే పని పెట్టుకోరు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో ఎంతటి మురికి బకెట్ , మగ్గునైనా నిమిషాల్లో క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Latest Videos


మురికిగా మారిన బాత్ రూం బకెట్, మగ్గును ఇంట్లో ఉన్న రెండే రెండు వస్తువులతో చాలా సులువుగా పోగొట్టొచ్చు. ఇది బకెట్ ను, మగ్గును కొత్తవాటిలా మెరిసేలా చేస్తుంది. అవేంటంటే? 

బాత్రూమ్‌లో ఉన్న బకెట్ మరియు మగ్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి?

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాతో ఎంతటి మురికినైనా ఇట్టే వదిలించొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకుని దాంట్లో నిమ్మరసం, డిష్ వాష్ ను వేసి బాగా కలపండి.

ఇప్పుడు మీరు వాడటి టూత్ బ్రష్ో ను తీసుకుని మీరు తయారుచేసిన మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని బకెట్ కు, మగ్గుకు రుద్దండి. మొత్తం రుద్దిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఆ తర్వాత బ్రష్ తో రుద్ది క్లీన్ చేయండి. దీన్ని శుభ్రం చేయడానికి చల్ల నీళ్లు లేదా వేడి నీళ్లను వాడొచ్చు. 

వినెగర్:

వెనిగర్ మొండి మరకలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మురికిగా మారిన బకెట్, మగ్‌ను మెరిసేలా చేయడానికి బేకింగ్ సోడాతో పాటు వినెగర్ కూడా వాడొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొంచెం బేకింగ్ సోడాను తీసుకోండి. దీనిలోనే రెండు స్పూన్ల వినెగర్ ను వేసి కలపండి.

దీన్ని టూత్ బ్రష్ తో మురికిగా మారిన బకెట్, మగ్‌పై కు పెట్టండి. పది నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వా నీళ్లతో శుభ్రం చేయండి. ఇప్పుడు బాత్ రూం బకెట్, మగ్గు కొత్తవాటిలా, ఎలాంటి మరకలు లేకుండా కనిపిస్తాయి. 

click me!