పగలకుండా గుడ్లను ఎలా ఉడికించాలి?
ఉడికేటప్పుడు గుడ్లు ఖచ్చితంగా ఒకటో రెండో పగిలిపోతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం గుడ్లు పగిలిపోకుండా ఉడికిపోతాయి. అలాగే పగుళ్లు వచ్చిన గుడ్లు కూడా చక్కగా ఉడుకుతాయి. ఇందుకోసం ముందుగా.. ఒక పెద్ద గిన్నెలో నీళ్లను తీసుకుని వేడి చేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు దాంట్లో ఒక నుంచి రెండు టీస్పూన్ల వైట్ వెనిగర్ వేయండి. ఆ తర్వాత గుడ్లను వేయండి.
మీకు తెలుసా? వేడి నీళ్లలో వెనిగర్ ను వేసి కలిపి గుడ్లను ఉడికిస్తే గుడ్లు అస్సలు పగిలిపోవు. అలాగే పగుళ్లు వచ్చిన గుడ్లు కూడా చక్కగా ఉడుకుతాయి. వాటి నుంచి తెల్ల సొన లీక్ అయ్యే అవకాశం ఉండదు.