సమ్మర్ లో మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోయినా ఒక్కోసారి స్కిన్ టానింగ్ అయిపోతుంది.మొటిమలు వచ్చేస్తాయి.. బ్లాక్ హెడ్స్ కూడా ముఖ అందాన్ని పోగొడతాయి. చర్మం గ్లో కూడా తగ్గిపోతుంది. అందుకే వారు తమ చర్మ కాంతిని కాపాడుకోవడానికి ఇంట్లో ఈజీగా లభించే వాటినిరాస్తే చాలు. వాటిలో కలబంద ముందు వరసలో ఉంటుంది. కలబందని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఇది మన చర్మాన్ని స్మూత్ గా, మెరిసేలా మార్చడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జులో ఉండే లక్షణాలు మన చర్మాన్ని చల్లబరచడానికి, హైడ్రేటెడ్ గా మార్చడానికి సహాయపడుతుంది.
ముఖానికి కలబంద జెల్ ఎలా అప్లై చేయాలి?
తాజా కలబంద జెల్‌ను తీసుకొని మీ ముఖంపై మసాజ్ చేసినట్లుగా అప్లై చేయండి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు దీనిని రాయడం ఉత్తమం. మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది