స్క్రబ్బర్ తో గిన్నెలు తోముతున్నారా? ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 1, 2024, 11:48 AM IST

ఒకప్పుడు ఊర్లలో కొబ్బరిపీచుతో గిన్నెలను తోమే వారు. కానీ ఇప్పుడు పళ్లెల్లో కూడా డిష్ వాష్ స్క్రబ్బర్ ను ఉపయోగిస్తున్నారు. దీనితో గిన్నెల మురికి క్షణాల్లో వదిలిపోతుంది. అసలు దీనిని వాడొచ్చా? వాడితే ఎన్ని రోజులకోసారి మార్చాలో తెలుసా? 
 

ప్రతి ఒక్కరూ డిష్ వాషింగ్ కోసం  స్క్రబ్బర్ ను ఉపయోగిస్తారు. ఇక ఈ స్క్రబ్బర్లతో ఎలాంటి జిడ్డు గిన్నెలనైనా క్షణాల్లోనే క్లీన్ చేస్తుంటారు. విచిత్రమేంటంటే.. ఈ డిష్ వాష్ స్క్రబ్బర్ అరిగి అరిగి.. చిన్నగా అయిన తర్వాతే డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ వీటిని ఇలా వాడొచ్చా? వాడితే ఏమౌతుంది? దీన్ని ఎన్ని రోజులకోసారి మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

స్క్రబ్బర్ సురక్షితమేనా?

ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో.. సూక్ష్మజీవులు జీవించడానికి స్క్రబ్బర్ ఒక మంచి అనువైన ఆవాసమని కనుగొన్నారు. మన ఇంట్లో ఉండే అత్యంత కలుషితమైన వస్తువులలో డిష్ వాషింగ్ స్క్రబ్బర్ ఒకటి.అంటే ఇది అంత సేఫ్ కాదన్న మాట.
 



ఎప్పుడు మార్చాలి? 

డిష్ వాష్ స్క్రబ్బర్ తో మనకు ఎలాంటి సమస్యలు రావొద్దన్నా వీటిని  వారినికి ఒక సారి ఖచ్చితంగా మార్చాలి. వారానికి ఒకసారి డిష్ వాషింగ్ స్క్రబ్బర్ మార్చడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. లేదంటే దీనిలోని సూక్ష్మక్రిములు మనకు సోకి ఎన్నో వ్యాధుల బారిన పడతాం.  
 

వారానికి ఒకసారి వీటిని మార్చకపోతే ఎలా క్లీన్ చేయాలి? 

మీరు వారానికి ఒకసారి డిష్ వాష్ స్క్రబ్బర్ ను మార్చకపోతే మీరు దీన్ని క్లీన్ చేసి వాడొచ్చు. ఇందుకోసం మీరు డిష్ వాషర్ స్క్రబ్బర్ ను వేడి నీళ్లలో రెండు నిమిషాల పాటు నానబెట్టండి. 
 

బ్లీచింగ్ పౌడర్

మీరు డిష్ వాస్ స్క్రబ్బర్ ను బ్లీచింగ్ పౌడర్ తో  కూడా శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం అర టీస్పూన్ బ్లీచింగ్ పౌడర్ ను నీటిలో కరిగించండి. దీనిలో స్క్రబ్బర్ ను రెండు నిమిషాల పాటు నానబెట్టండి.
దీనివల్ల స్క్రబ్బర్ కు ఉన్న సూక్ష్మక్రిములు తొలగిపోతాయి.  అయితే స్క్రబ్బర్ ను శుభ్రం చేసే ఈ పద్ధతి అన్ని రకాల బ్యాక్టీరియాలను చంపదు.  కాబట్టి వారానికి ఒకసారి స్క్రబ్బర్ ను మార్చడమే మంచిది. 

Latest Videos

click me!