రాత్రి పడుకునే ఈ 5 పనులు చేస్తే మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది

First Published | Aug 1, 2024, 10:50 AM IST

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే ఇలా ఒత్తైన జుట్టు ఉంటుంది. అయితే మీరు రాత్రి పడుకునే ముందు ఐదు పనులు చేస్తే మీ జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది. మందంగా ఉంటుంది.

శరీర ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. జుట్టు సంరక్షణ కూడా అంతే ముఖ్యం. జుట్టు  ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఖచ్చితంగా తీసుకోవాలి. పోషకాహార లోపం వల్లే జుట్టు దెబ్బతింటుంది. డ్రైగా మారుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా బాగా పెరుగుతుంది. అయితే మీరు రాత్రిపూట పడుకునే ముందు కొన్నిపనులు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. ఇందుకోసం రాత్రిపూట ఏం చేయాలంటే? 
 

hair care

శుభ్రం చేయాలి

అవును రాత్రి పడుకునే ముందు జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల జుట్టు పగిలిపోయే ప్రమాదం తగ్గుతుంది. అలాగే వెంట్రుకలు తెగిపోవు కూడా. అంతేకాదు మీ నెత్తికి విశ్రాంతినిస్తుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 
 

Latest Videos


హెయిర్ సీరం

హెయిర్ సీరం కూడా జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు మీ జుట్టుకు హెయిర్ సీరం ను వాడితే మీ జుట్టు చిక్కులు పడదు. అయితే ఈ హెయిర్ సీరం ను మీరు ఇంట్లో కూడా అప్లై చేయొచ్చు.

hair care

స్కాల్ప్ మసాజ్ 

స్కాల్ప్ మసాజ్ మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మన జుట్టును ఆరోగ్యంగా, పొడవుగా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం రాత్రిపూట మీరు పడుకునే ముందు తలను బాగా మసాజ్ చేయాలి. ఇది నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే  జుట్టును బలోపేతం చేస్తుంది.

జడ వదులుగా

చాలా మంది రాత్రిపడుకునే ముందు జుట్టును టైట్ గా అల్లుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది కుదుళ్లు లూజ్ గా అయ్యేలా చేస్తుంది. దీంతో మీ జుట్టు ఊడిపోతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు మీ జుట్టును వదులుగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల జుట్టు తెగిపోవడం, రాలిపోవడం వంటి సమస్యలు పెద్దగా ఉండవు. ఈ విధంగా మీరు జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇది జుట్టుకు  ఎలాంటి హాని కలిగించదు.

సిల్క్ దిండులు

పడుకునే ముందు సిల్క్ దిండుపై పడుకోండి. ఈ సిల్క్ దిండుపై పడుకోవడం వల్ల మీ జుట్టు పెద్దగా డ్యామేజ్ అవ్వదు. అలాగే జుట్టు రాలే సమస్య కూడా ఉండదు. అందుకే మృదువైన దిండులపై పడుకోవడం మంచిదని నిపుణులు చెప్తారు.
 

తడి జుట్టుతో నిద్రపోవడం 

ఏది ఏమైనా జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు పడుకోకూడదు. తడి జుట్టుతో పడుకుంటే ఈ అలవాటు వెంటనే మార్చుకోండి. మీకు తెలుసా? తడి జుట్టుతో ఎప్పుడూ నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల మీ జుట్టు త్వరగా డ్యామేజ్ అవుతుంది.
 

జుట్టు ఆరోగ్యం..

రాత్రిపూట జుట్టు సంరక్షణ తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మీ జుట్టు రాలిపోవడం, తెగిపోవడం వంటి జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇది మీ జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుంది.

click me!