జుట్టు బాగా ఊడిపోతోందా..? మీ కిచెన్ లో పరిష్కారం.. వారంలో రిజల్ట్ పక్కా..!

First Published | Aug 1, 2024, 9:49 AM IST

కేవలం రెండు వారాల్లోనే మీ జుట్టు పెరగడాన్ని మీరు గమనిస్తారు. మరి.. ఈ వెల్లుల్లి నూనె ను మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో, తలకు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం...
 

మనకు ఊహ తెలిసినప్పటి నుంచి.. తలకు నూనె రాస్తూనే ఉంటాం.  ఎక్కువ మంది కొబ్బరి నూనె మాత్రమే వాడుతూ ఉంటారు. లేదు అంటే బాదం నూనె, ఆముదం లాంటివి అప్పుడప్పుడు రాస్తూ ఉంటాం. కానీ... ఎప్పుడైనా వెల్లుల్లి నూనె  తలకు రాశారా..? వెల్లుల్లిని వంటలో వాడటమే తెలుసు కానీ.. వెల్లుల్లి నూనెను ఎప్పుడైనా తలకు రాశారా..? ఒక్కసారి ఈ నూనె రాయడం మొదలుపెడితే.. కేవలం రెండు వారాల్లోనే మీ జుట్టు పెరగడాన్ని మీరు గమనిస్తారు. మరి.. ఈ వెల్లుల్లి నూనె ను మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో, తలకు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం...
 

Garlic oil

వెల్లుల్లి నూనె జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఎందుకంటే జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే అన్ని విటమిన్స్, మినరల్స్ ఇందులో పుష్కలంలగా ఉంటాయి. అంతేకాదు.. ఈ నూనె తలకు రాయడం వల్ల.. మంచిగా రక్త ప్రసరణ కూడా జరుగుతుంది.  జుట్టు కుదుళ్లు బలపడి.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. 



వెల్లుల్లిలో సల్ఫర్, సెలెనియమ్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి.. జుట్టు ఒత్తుగా పెరగడానికి బాగా సహాయపడతాయి.  అంతేకాదు.. సల్ఫర్.. జుట్టు కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించినట్లుగా.. స్మూత్ గా మారుస్తుంది.  ఇక సెలెనియం.. జుట్టు ఆకృతి అందంగా మార్చడానికి సహాయపడుతుంది.  వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి.. మనకు చుండ్రు లాంటి సమస్య రాకుండా కాపాడుతుంది. చుండ్రు మాత్రమే కాదు.. మరే ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.  రెగ్యులర్ గా ఈ వెల్లుల్లి నూనె రాస్తే.. జుట్టు రాలడం అతి తక్కువ రోజుల్లోనే ఆగిపోతుంది. 
 

ఈ నూనె ఎలా తయారు చేసుకోవాలి అంటే...

1.10 నుంచి 12 వరకు తాజా వెల్లుల్లి రెబ్బలు.
2.ఒక  కప్పు నూనె( ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, జొజోబా ఆయిల్)
అంతే.. ఈ రెండు పదార్థాలతో మనం హెల్దీ హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం..
ముందుగా.. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసేసి...వాటిని క్రష్ చేయాలి. అప్పుడు దాంట్లో నుంచి సహజమైన నూనెలు బయటకు వస్తాయి.  ఇప్పుడు.. ఈ స్మాష్ చేసిన వెల్లుల్లి రెబ్బలను  మనం ముందుగా తీసుకున్న ఆలివ్, కొబ్బరి, జొజోబా ఆయిల్ లను మిక్స్ చేసి... ఒక సాస్ ప్యాన్  లో వేసి కలపాలి. స్టవ్ మీద దానిని ఉంచి... తక్కువ మంట మీద ఉంచి నూనె వేడి చేయాలి. ఎక్కువ మంట మీద వేడి చేస్తే.. దాని ప్రాపర్టీలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. తక్కువ మంటపై వేడి చేయాలి. వెల్లుల్లి రెబ్బలను మాడకుండా కలుపుతూ ఉండాలి. 

garlic

15 నిమిషాల తర్వాత... ఆ నూనెను చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ నూనె వడబోసుకొని.. గాజు సీసాలో స్టోర్ చేయాలి. ఇప్పుడు.. ఆ నూనె ను రెగ్యులర్ గా తలకు పట్టిస్తూ ఉండాలి.

కనీసం వారానికి రెండు సార్లు అయినా రాయాలి.  కేవలం వారం రోజుల్లో జుట్టు రాలడం ఆగడమే కాదు..  కొత్తగా జుట్టు పెరగడం కూడా స్పష్టంగా కనపడుతుంది. కావాలంటే ఓసారి ప్రయత్నంచి చూడండి. 

Latest Videos

click me!