ఆలివ్ నూనె, కోడి గుడ్డుతో హెయిర్ మాస్క్ వేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది. ఆలివ్ నూనెలోని కొవ్వు ఆమ్లాలు మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తాయి. అదేవిధంగా, గుడ్లలోని ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మీకు గుడ్డు వాసన నచ్చకపోతే, మీరు హెయిర్ ప్యాక్ చేయడానికి గుడ్డులోని తెల్లసొనను మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ హెయిర్ ప్యాక్‌ను మీ తలపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి, తర్వాత హెర్బల్ షాంపూతో కడగాలి.
కొబ్బరి నూనె
ఆలివ్ నూనెను నేరుగా నెత్తికి అప్లై చేయడానికి బదులుగా, కొబ్బరి నూనెతో కలపడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. దీని కోసం.. ఆలివ్ నూనె , కొబ్బరి నూనెను సమాన మొత్తంలో తీసుకొని, వేడి చేసి, తల నుండి చివర్ల వరకు అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. మీరు ఇలా క్రమం తప్పకుండా చేస్తే, మీరు మంచి మార్పును చూస్తారు.
కలబంద, ఆలివ్ ఆయిల్..
పొడి జుట్టు సమస్యలు ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక. దీని కోసం, ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ , 2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ కలిపి తల నుండి చివర్ల వరకు అప్లై చేయండి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.
తలస్నానానికి ముందు నూనె..
సాధారణంగా, చాలా మంది తలస్నానం చేసే ముందు జుట్టుకు నూనె రాసుకుంటారు. కానీ మీరు ఇతర నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను ఉపయోగిస్తే, మీరు మంచి ఫలితాలను చూస్తారు. దీని కోసం, తలస్నానం చేయడానికి అరగంట ముందు మీ జుట్టుకు ఆలివ్ నూనెను అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. అది కూడా సల్ఫేట్ లేని షాంపూని ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.