Tampon Use: మొదటిసారి టాంపన్స్ వాడుతున్నారా? ఈ తప్పులు చేయకండి..ప్యాడ్స్‌కి వీటికి తేడా ఏంటి?

Published : Jul 02, 2026, 05:09 PM IST

Tampon Use: పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్ కంటే టాంపన్స్ (Tampons) వాడటం కంఫర్టబుల్‌గా ఉంటుంది. స్విమ్మింగ్, స్పోర్ట్స్ టైంలో సౌకర్యంగా అనిపిస్తుంది. అయితే, మొదటిసారి టాంపన్స్ వాడేటప్పుడు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటో తెలుసా? 

PREV
16
ఎక్కువ సమయం మార్చకుండా ఉండటం

చాలామంది చేసే కామన్ మిస్టేక్.. టాంపన్‌ను రోజంతా అలాగే ఉంచేయడం. టాంపన్‌ను 4 నుండి 6 గంటల కంటే ఎక్కువ సమయం లోపల ఉంచకూడదు. అలా ఉంచితే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (TSS) అనే అరుదైన, ప్రాణాంతకమైన బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 

26
రాత్రి పడుకునేటప్పుడు వాడటం

రాత్రి నిద్రపోయేటప్పుడు టాంపన్స్ వాడటం అంత సురక్షితం కాదు. మనం రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రపోతాం. పైన చెప్పుకున్నట్టు 6 గంటల కంటే ఎక్కువ సమయం టాంపన్ లోపల ఉంటే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అందుకే రాత్రి వేళల్లో టాంపన్స్‌కు బదులు శానిటరీ ప్యాడ్స్ వాడటమే బెస్ట్. 

36
చేతులు కడుక్కోవాలి

హడావుడిలో చాలామంది చేతులు శుభ్రం చేసుకోకుండానే టాంపన్‌ను లోపలికి పెడుతుంటారు. మన చేతులకు ఉండే బాక్టీరియా టాంపన్ ద్వారా నేరుగా యోని లోపలికి వెళ్లి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. కాబట్టి టాంపన్ ముట్టుకునే ముందు, తీసేసిన తర్వాత కూడా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. 

46
సరైన సైజ్ ఎంచుకోకపోవడం

మీకు అయ్యే బ్లీడింగ్‌ను బట్టి కాకుండా, ఎక్కువ సేపు వస్తుందని హై-అబ్సార్బెన్సీ (Heavy flow) టాంపన్స్ వాడటం తప్పు. బ్లీడింగ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ పీల్చుకునే టాంపన్ వాడితే, అది లోపల ఉన్న సహజ తేమను కూడా పీల్చేసి డ్రైనెస్‌ను కలిగిస్తుంది. దీనివల్ల టాంపన్ తీసేటప్పుడు నొప్పి పుడుతుంది. 

56
బాత్రూమ్‍కు వెళ్లినప్పుడు మార్చుకోవాలి

యూరిన్ వచ్చే ద్వారం వేరు, టాంపన్ పెట్టే ద్వారం వేరు. కాబట్టి యూరిన్‌కి వెళ్లిన ప్రతిసారీ టాంపన్ మార్చాల్సిన అవసరం లేదు. అయితే, యూరిన్ వెళ్లేటప్పుడు టాంపన్ దారం తడవకుండా పక్కకు పట్టుకోవాలి. ఒకవేళ దారం తడిస్తే మాత్రం బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది కాబట్టి మార్చేయడం మంచిది.

యూరిన్‌కి పర్వాలేదు కానీ, మోషన్‌కి వెళ్లినప్పుడు మాత్రం టాంపన్ మార్చేయడం సురక్షితం. లేకపోతే బ్యాక్టీరియా టాంపన్ దారానికి అంటుకుని, అది యోని ద్వారా లోపలికి వెళ్లే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి మోషన్‌కి వెళ్లేముందు టాంపన్ తీసేయడం మంచిది.

66
సరైన రీతిలో పెట్టుకోవాలి

టాంపన్ లోపలికి పెట్టిన తర్వాత మీకు కూర్చున్నా, నడిచినా ఏదో గుచ్చుకుంటున్నట్టు లేదా ఇబ్బందిగా అనిపిస్తే... మీరు దాన్ని సరిగ్గా లోపలికి పెట్టలేదని అర్థం. సరైన రీతిలో పెట్టుకుంటే అసలు ఏదైనా ఉందనే విషయమే మీకు తెలియదు. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే దాన్ని తీసేసి, కొత్తది సరిగ్గా పెట్టుకోండి. 

Read more Photos on
click me!

Recommended Stories