బాదం పప్పు, నువ్వులు..
బాదం పప్పులో మెగ్నీషియం, నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్ శరీరానికి అందుతాయి. ప్రతిరోజూ రాత్రి నానపెట్టిన 5 నుంచి 6 బాదం పప్పులను ఉదయాన్నే తీసుకోవచ్చు. రోజుకి ఒక స్పూన్ నువ్వులు తినాలి.
ఆకు కూరలు..
40 ఏళ్లు దాటిన మహిళలు ప్రతిరోజూ పాలకూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు రోజూ తీసుకోవాలి. వీటిల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. రక్తహీనత సమస్య ఉండదు. శరీరానికి అవసరమైన ఖనిజాలు కూడా అందుతాయి. ప్రతిరోజూ తినకపోయినా వారానికి 4 నుంచి 5 సార్లు అయినా ఆకుకూరలు తీసుకోవాలి.
పప్పులు, శనగలు
పప్పులు, శనగలు, రాజ్మా, సోయాబీన్స్ వంటి వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కండరాల క్షీణత తగ్గుతుంది. శక్తి పెరుగుతుంది. ఎక్కువ సేపు ఆకలివేయదు. అధిక బరువు పెరిగే సమస్య ఉండదు. ప్రతిరోజూ పప్పు, శనగలు తీసుకోవాలి.
ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడంతో పాటు.. ప్రతిరోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాలపాటు నడవాలి. ఎండ తగిలే సమయంలో నడవడం మంచిది. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. యోగా చేసినా మంచిదే. తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు.