రోజూ ఉదయాన్నే పరగడుపున తులసి నీటిని తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు రావు. ఆరోగ్యంగా ఉంటారు. యాక్టివ్‍గా, ఫ్రెష్‍గా అనిపిస్తుంది.
తులసి రసం ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
తులసి నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సీజనల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరం వంటి వాటి నుంచి మన శరీరాన్ని కాపాడతాయి.
తులసి నీరు జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. కడుపునొప్పి, యాసిడ్ రిఫ్లక్స్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
తులసిలోని యాంటీమైక్రోబయల్, ఎక్స్‌పెక్టరెంట్ గుణాలు కఫాన్ని తొలగిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, గొంతునొప్పి లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
తులసిలోని ఫైటోకెమికల్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.
Sugar Cravings: షుగర్ క్రేవింగ్స్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవిగో!
Anklet Designs: 2 ఇన్ 1 వెండి పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి..!
Apple Earrings: యాపిల్ షేప్ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!
Saree Designs: సిల్క్ నుంచి హ్యాండ్‌లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో