Mehandi: చేతులకు పెట్టుకున్న గోరింటాకు తొందరగా పోవాలంటే ఏం చేయాలో తెలుసా?

Published : Jul 14, 2025, 06:06 PM IST

టమోటా రసంలో చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలు ఉన్నాయి. ఇది మెహందీని తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

PREV
15
చేతులకు మెహందీ బోర్ కొట్టిందా?

ఫంక్షన్లు, పెళ్లి, ఏదైనా శుభకార్యం ఏదైనా సరే.. అమ్మాయిలు తమ చేతలకు మెహందీ పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాదు.. ప్రస్తుతం ఆషాఢమాసం. ఈ నెలలో దాదాపు మహిళలు అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. అయితే.. మెహందీ, గోరింటాకు చేతులకు ఎర్రగా పండినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది. కానీ, రెండు, మూడు రోజుల తర్వాత కొంచెం రంగు తగ్గిన తర్వాత చాలా మందికి నచ్చదు. దీంతో, ఆ రంగు తొందరగా పోతే బాగుండు అని కోరుకుంటారు. కానీ, అంత తొందరగా పోదు. అయితే.. కొన్ని పదార్థాలను వాడితే.. ఆ రంగు చాలా సులభంగా వదులుతుంది. మరి, అదేంటో చూద్దామా...

25
బేకింగ్ సోడా...

 బేకింగ్ సోడా దుస్తుల నుంచి మాత్రమే కాకుండా చర్మం మీద మొండి మరకలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. సబ్బులాగా నురుగును సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని కోసం, మీ చేతులను తడిపి మీ చేతులకు ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను అప్లూ చేసి స్క్రబ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత, మీ చేతులను కడుక్కోండి. తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. దీని వల్ల మీ చేతులు డ్రై అవ్వకుండా కాపాడుకోగలం. ఇక.. బేకింగ్ సోడా వాడటం వల్ల.. తొందరగా గోరింటాకు, మెహందీ రంగులు సులభంగా వదులుతాయి.

35
టమోటా రసం:

 టమోటా రసంలో చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలు ఉన్నాయి. ఇది మెహందీని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం, టమోటా నుండి రసాన్ని తీసి, మీ చేతులకు బాగా అప్లై చేసి, అరగంట పాటు ఆరనివ్వండి. తర్వాత మీ చేతులను నీటితో కడగాలి.

45
చక్కెర ,కొబ్బరి నూనె:

 చక్కెర ఒక సహజమైన ఎక్స్‌ఫోలియంట్ ,కొబ్బరి నూనె చర్మాన్ని ప్రకాశవంతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెండింటినీ కలిపితే చర్మాన్ని ప్రకాశవంతం చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ రెండూ కలిపి రాయడం వల్ల మెహందీని చాలా ఈజీగా తొలగించవచ్చు. ముందుగా.. ఈ రెండింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత, ఈ పేస్ట్‌ను మెహందీ తో ఉన్న మీ చేతులకి అప్లై చేయాలి.చక్కెర కరిగిపోయే వరకు స్క్రబ్ చేసి మీ చేతులు కడుక్కోండి.

55
నిమ్మరసం...

మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో నిమ్మరసం చాలా బాగా సహాయపడుతుంది. అదేవిధంగా మెహందీని తొలగించడంలోనూ సహాయపడుతుంది. మీ చేతులపై నిమ్మకాయ రసాన్ని రాసి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. లేదంటే.. నిమ్మకాయ రసంలో బేకింగ్ సోడా అప్లై చేసి చేతులకు రుద్ది.. తర్వాత నీటితో కడుక్కోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా రెండు, మూడుసార్లు చేస్తే. మెహందీ సులభంగా పోతుంది.

హ్యాండ్ శానిటైజర్: హ్యాండ్ శానిటైజర్ బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగిస్తారు. ఇది చేతుల నుండి క్రిములను తొలగించడంలో సహాయపడటమే కాకుండా మెహందీని త్వరగా తొలగించడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం, ఎప్పటికప్పుడు మీ చేతులపై హ్యాండ్ శానిటైజర్‌ను అప్లై చేసి రుద్దండి.

దీనితో పాటు, మీ చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోండి.

టూత్‌పేస్ట్‌ను మీ అరచేతులకు పూయండి, మీ చేతులను బాగా రుద్దండి, ఆపై నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఆలివ్ నూనెలో కొద్దిగా ఉప్పు కలిపి మీ చేతులపై రుద్దండి. 15 నిమిషాల తర్వాత మీ చేతులను కడుక్కోండి. మీ చేతులు ఎండిపోకుండా ఉండటానికి మాయిశ్చరైజర్‌ను రాసుకోవడం మర్చిపోవద్దు.

Read more Photos on
click me!

Recommended Stories