జుట్టు కోసం ఎలా వాడాలి..?
మీ జుట్టు జిడ్డుగా ఉంటే, ఆ జిడ్డును వదిలించుకోవడానికి మీరు మందార పూలను వాడొచ్చు.మీరు కొన్ని మందార పూలు, మెంతులు తీసుకోవాలి. వాటిని రుబ్బి.. దానికి ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్ల చేసి.. గంట తర్వాత షాంపూ చేస్తే చాలు. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరిచేలా చేస్తుంది.మందార పూలు మంచి హెయిర్ కండిషనర్ లా కూడా పని చేస్తాయి. మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా మారి కనపడితే, మీరు మందార నూనె వాడొచ్చు. ఈ నూనె రాయడం వల్ల మీ జుట్టు మృదువుగా మారుతుంది. ఈ పూలను గ్రైండ్ చేసి, వాటికి ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి జుట్టుకు రాసి మసాజ్ చేస్తే చాలు. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది.