Skin Care: మీ చర్మానికి అందాన్ని తెచ్చే పండ్లు ఇవి, ఇలా వాడితే చాలు

ఎండాకాలంలో చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి ఏవేవో క్రీములు, నూనెలు వాడుతున్నారా? అయినా ఫలితం లేదా? అయితే, వాటికి బదులు మీ అందాన్ని పెంచేలా కొన్ని పండ్లను వాడితే చాలు. మరి, వాటిని ఎలా వాడాలో తెలుసుకుందామా..

summer fruits for skin glow in telugu ram
fruit facepack

ఎండాకాలంలో స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా ఎండకు బయటకు వెళ్లేవారి చర్మం మరింత దెబ్బతింటుంది.ఇలా దెబ్బతినకుండా ఉండేందుకు చాలా మంది చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. అయితే,వాటిలో ఉండే కెమికల్స్ మన చర్మానికి మేలు చేయడం పక్కన పెడితే.. నష్టం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.మరి, అలా కాకుండా.. చర్మాన్ని అందంగా మార్చుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? దాని కోసం మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని రకాల పండ్లతో మీ అందాన్ని పెంచుకోవచ్చు. అయితే, దానిని ఎలా వాడాలి అనే విషయం మాత్రం తెలుసుకోవాల్సిందే.

summer fruits for skin glow in telugu ram

1.మామిడి పండు..
మామిడి పండును అన్ని పండ్లలో కెల్లా రారాజుగా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మంపై కూడా అద్భుతాలు చేస్తుంది. ఈ పండులో విటమిన్ ఏ, సి లతో నిండి ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా చేయడానికి, స్కిన్ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కూడా సహాయం చేస్తుంది.  అంతేకాదు.. స్కిన్ ని మృదువుగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది.చర్మాన్ని హైడ్రేటెడ్ గా కూడా చేస్తుంది.


2.పుచ్చకాయ..
పుచ్చకాయను వేసవి పండు అని చెప్పొచ్చు. ఈ సీజన్ లో ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పండు బాగా సహాయపడుతుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పుచ్చకాయలో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో యవ్వనంగా కనపడతాం.

3. బొప్పాయి

బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చనిపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. ముఖంపై ఏవైనా నల్లమచ్చలు ఉన్నా, వాటిని తొలగించడంలో సహాయం చేస్తుంది. స్కిన్ కలర్ ని మెరుగుపరుస్తుంది.

4. నారింజ

నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి మన స్కిన్ ని మెరిచేలా చేయడానికి సహాయపడుతుంది. నల్లటి మచ్చలను తొలగించడానికి, స్కిన్ ని టైట్ గా మార్చడానికి సహాయపడుతుంది. దీని వల్ల య వ్వనంగా మారేలా చేస్తుంది.

Face Pack

5.పైనాపిల్..
పైనాపిల్ లో బ్రోమెలైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చనిపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడానికి సహాయపడుతుంది. స్కిన్ పై నల్ల మచ్చలు తొలగించడానికీ సహాయపడుతుంది. ఇందులో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా చర్మాన్ని యవ్వనంగా మార్చుతుంది.మీరు కోల్పోయిన స్కిన్ గ్లోని మళ్లీ తీసుకురావడంలో సహాయపడుతుంది.

face pack

మరి, ఈ పండ్లను స్కిన్ కేర్ రొటీన్ లో ఎలా వాడాలి..?

 DIY ఫేస్ మాస్క్‌లు: కేవలం అరగంటలో మన ముఖంపై మెరుపు తీసుకురావాలి అంటే ఈ పండ్లతో ఫేస్ మాస్క్ వేస్తే చాలు. తక్షణ మెరుపు కోసం పుచ్చకాయ, బొప్పాయి లేదా మామిడి వంటి పండ్లను తేనె లేదా పెరుగుతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రం చేసుకోండి.

పండ్లతో కలిపిన ఐస్ క్యూబ్స్: పండ్ల రసం లేదా గుజ్జును ఫ్రీజ్ చేసి, ఆ క్యూబ్స్‌ను ఉపయోగించి మీ ముఖంపై సున్నితంగా రుద్దండి. ముఖం గ్లోయిగా మారుతుంది.

హైడ్రేటింగ్ : రోజంతా రిఫ్రెషింగ్ గా మీ ఫేస్ ఉంచాలి అనుకుంటే, దాని కోసం పండ్ల సారాలను (పుచ్చకాయ, నారింజ లేదా పైనాపిల్ వంటివి) రోజ్ వాటర్‌తో కలపండి. అవి ముఖానికి రాసినా చాలు.

 స్క్రబ్‌లు, ప్యాక్‌లు: సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్ కోసం పండ్ల తొక్కలు లేదా గుజ్జులను ఉపయోగించండి. ఉదాహరణకు, నారింజ తొక్కల పొడి లేదా బొప్పాయి గుజ్జును కొద్దిగా తేనెతో కలిపి మీ చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా ఉంచే సహజ స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. దీనిని ముఖానికి సున్నితంగా రుద్దడం వల్ల కూడా మీ ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.

Latest Videos

vuukle one pixel image
click me!